రాజకీయాలు

‘Free Kashmir’ Placard: ‘పాకిస్తాన్ జిందాబాద్’ కలకలం మరువక ముందే మరో ఘటన, ముక్తి కాశ్మీర్ అంటూ ప్లకార్డు పట్టుకున్న మహిళ, అదుపులోకి తీసుకున్న బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

‘ముస్లింలు, దళితులు, కశ్మీర్, బహుజన్, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లకు విముక్తి కావాలి’(Kashmir Mukti, Dalit Mukti,Muslim Mukti) అని ప్లకార్డుపై రాసి ప్రదర్శించింది. ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్‌.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Jamia Violence: పోలీసులపై రాళ్లు రువ్వుతూ లైబ్రరీలోకి దూసుకెళ్లారు, జామియా వార్‌ తాజా వీడియో వెలుగులోకి, యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా లోపలికి ఎవరూ వెళ్లలేరన్న పోలీస్ అధికారి రంధ్వా

Hazarath Reddy

సీఏఏకు వ్యతిరేకంగా జామీయా యూనివర్సిటీలో (Jamia Millia Islamia (JMI)) జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. డిసెంబర్‌ 15న జరిగిన ఈ హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో మరికొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.

Amaravati Bandh: నేడు అమరావతి బంద్, ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ, 29 గ్రామాల్లో కొనసాగుతున్న బంద్, 67వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో ఆందోళన చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. దీనికి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఇవాళ బంద్‌కు చేపడుతున్నారు. 29 గ్రామాల్లో బంద్‌ (Amaravati Bandh) జరుగుతుందని జేఏసీ ప్రకటించింది.

Special Investigation Team: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు, జీవోలో పోలీస్ స్టేషన్ ప్రస్తావన, ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు

Hazarath Reddy

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని అమరావతిలో (AP capital Amaravati) భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) (Special Investigation Team (SIT)) జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Shaheen Bagh Mediation: 69 రోజుల తర్వాత పాక్షికంగా తెరుచుకున్న నోయిడా- ఫరీదాబాద్ రహదారి, షాహీన్ బాగ్ నిరసనలతో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన రాకపోకలు

Vikas Manda

అయినప్పటికీ, షాహీన్ బాగ్ నిరసనకారులు ఆ స్థలాన్ని విడిచిపెట్టేందుకు పూర్తి సిద్ధంగా లేరు. అదే ప్రాంతంలో నిరసన చేస్తేనే ఏమైనా ప్రభావం ఉంటుందని వారు ధృడంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) ను వెనక్కి తీసుకుంటే, తాము ఆ రహదారిని ఖాళీ చేయడమే కాకుండా పూర్తి శుభ్రం కూడా చేస్తామని చెబుతున్నారు....

Sedition Case: సిఎఎ వ్యతిరేక సభలో యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలపై, దేశద్రోహం కేసు నమోదు, 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్ట్, బీజేపీ కుట్రగా అభివర్ణించిన ఓవైసీ

Vikas Manda

ఇదిలా ఉండగా అమూల్య వెనుక బీజేపి హస్తం ఉందని ఓవైసీ ఆరోపించారు. ఆ యువతికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము భారతీయులం అని, భారతీయులుగా గర్విస్తున్నామని అసదుద్దీన్ స్పష్టం చేశారు....

Amit Shah's Hyderabad Tour: అసదుద్దీన్ ఇలాఖాలో అమిత్ షా షో! సిఎఎకు మద్ధతుగా హైదరాబాద్‌లో బీజేపీ మెగా ర్యాలీ, ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ

Vikas Manda

చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) సవాల్ చేసేలా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన హైదరాబాద్ లోనే అమిత్ షా భారీ సభ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓవైసీ మాట్లాడుతూ సిఎఎపై అమిత్ షా బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే....

Hyderabad: పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాదీలకు ఆధార్ అథారిటీ నోటీసులు, తెలంగాణలో 400 మంది ఆధార్ కార్డుల రద్దుకు సిఫారసు, దీనిని సిఎఎతో ముడిపెట్టవద్దని వివరణ ఇచ్చుకున్న ఉడాయ్

Vikas Manda

ఆధార్ కార్డ్ అనేది భారత పౌరసత్వాన్ని సూచించే ధృవీకరణ పత్రం కాదు, ఆధార్‌కు మరియు పౌరసత్వ చట్టానికి ముడిపెడుతూ దుష్ప్రచారం చేయడం తగదని ఉడాయ్ పేర్కొంది. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆధార్ కార్డ్ పొందినట్లు పోలీసుల నుంచి మాకు సమాచారం అందింది.....

Advertisement

Chandrababu's Security Cover: బాబుకు జడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం, ఫేక్ వార్తలను కొట్టి పడేసిన ఏపీ డీజీపీ కార్యాలయం, మొత్తం 183 మందితో భద్రతను ఇస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (TDP chief N Chandrababu Naidu) భద్రతకు సంబంధించి ఏపీ డీజీపీ కార్యాలయం (AP DGP Office) కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు భద్రతను కుదించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతలో (Chandrababu Naidu's Security Cover)ఎలాంటి మార్పు జరగలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

UP Budget 2020: రూ.5 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్, అయోధ్యలో ఎయిర్‌పోర్టు కోసం రూ. 500 కోట్లు, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ కన్నా

Hazarath Reddy

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 5,12,860.72 కోట్ల రూపాయల బడ్జెట్‌ను (UP Budget 2020) రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా (Finance Minister Suresh Khanna) ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో (Yogi Adityanath) సహా ఆయన అసెంబ్లీకి చేరుకున్న ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

YSR Kanti Velugu: అవ్వా తాతలకు మనవడి భరోసా, గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు, వైయస్సార్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మూడో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలులో (Kurnool) ఈ కార్యక్రమాన్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

'Baat Bihar Ki': ప్రశాంత్ కిషోర్ కొత్త వ్యూహం, ఫిబ్రవరి 20 నుంచి బాత్ బీహార్ కీ కార్యక్రమం, సీఎం నితీష్ కుమార్‌కు చెక్ పెట్టే దిశగా అడుగులు, గాంధీ, గాడ్సేలు కలిసి వెళ్లలేరంటూ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

అయితే బీహార్‌లో కొద్ది రోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న కారణంతో నితీష్ కుమార్ (Chief Minister Nitish Kumar) పార్టీ జేడీయూ (JDU) ప్రశాంత్‌కిశోర్‌‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘బాత్‌ బిహార్‌ కీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

No Role For Third Party Mediation: కాశ్మీర్‌పై జోక్యం చేసుకోవద్దు, ఐరాస ప్రధాన కార్యదర్శికి భారత్ ఘాటు హెచ్చరిక, అక్కడ ఉగ్రమూకను ఖాళీ చేయించండి, తేల్చి చెప్పిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్

Hazarath Reddy

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ కొంచెం ఘాటుగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌పై (Jammu and Kashmir) ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ (General António Guterres) చేసిన ప్రతిపాదనను భారత్‌ (India) తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి భారత్ సిద్ధంగా లేదని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసే విషయం మీద ముందు ఐక్యరాజ్యసమితి దృష్టిసారించాలని కోరింది.

PM Narendra Modi-CAA: సీఏఏ, ఆర్టికల్ 370పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎంత వ్యతిరేకత వచ్చినా నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం, వారణాసిలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై (Article 370) వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్పష్టం చేశారు.

New Pension Cards: ఏపీలో కొత్త పెన్సన్ కార్డులు వచ్చేశాయి, నేటి నుంచి పంపిణీ చేయనున్న గ్రామ వాలంటీర్లు, కొత్తగా ఫించన్ మంజూరైన వారికి పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు

Hazarath Reddy

ఇటీవలే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం (AP Govt) పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త కార్డులను (New Pension Cards) పంపిణీ చేయబోతుంది. నేటి నుంచి లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు.

Telangana Cabinet Meet Highlights: పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, కేంద్రం తెలంగాణ కోసం చేసిందేం లేదు, ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్ కేబినేట్ భేటీ హైలైట్స్

Vikas Manda

ఈరోజు ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా గులాబీ దండు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున తమ అధినేత జన్మదిన వేడుకలు జరుపుకోటానికి ప్లాన్ చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా పిలుపునిచ్చారు.....

Advertisement

Subramanian Swamy: గాంధీ హత్య కేసు రీ-ఓపెన్ చేయాలి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు, ట్విట్టర్లో వరుసగా ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసుపై బీజేపీ ఎంపీ (BJP MP) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి (BJP MP Subramanian Swamy) ట్విటర్‌ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును (Mahatma Gandhi Murder Case) రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Justice Chandrachud: నిరసన తెలపడం దేశ ద్రోహం కాదు, అది ప్రజాస్వామ్యానికి రక్షణ, ఈ దేశం కొందరిది కాదు అందరిదీ, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్‌

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ (NRC), సీఏఏ (CAA) మీద నిరసనలు మిన్నంటున్నతున్న వేళ సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Dhananjaya Y.Chandrachud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి దేశద్రోహం కాదని, అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం వంటిదని ఆయన తెలిపారు.

Delhi CM Kejriwal Turns Singer: హమ్ హోంగే కామియాబ్ పాటతో అదరగొట్టిన ఆప్ అధినేత, మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, మంత్రులుగా 6 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) పీఠంపై సామాన్యుడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi L-G Anil Baijal) కేజ్రీవాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్‌ ప్రచారంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ప్రజలు ఆయన్ని సీఎంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Kem Chho Trump: హౌడీ మోదీని గుర్తు చేసేలా కెమ్‌ ఛో ట్రంప్‌, 3 గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు చేయనున్న గుజరాత్ ప్రభుత్వం, నమస్తే డొనాల్డ్ ట్రంప్‌ పేరు మార్చిన ప్రధాని మోదీ సర్కారు

Hazarath Reddy

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మోతెరాలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్‌ ఛో ట్రంప్‌’గా (Kem Chho Trump) నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్‌?’ అని అర్థం.

Advertisement
Advertisement