రాజకీయాలు
Shri Ram Janmabhoomi Teerth Kshetra: రామ మందిరం మొదలైనట్లే, లోక్ సభలో కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు..
Hazarath Reddyఅయోధ్యలో రామమందిర నిర్మాణం (Ayodhya Ram Temple) దిశగా మరో అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను (Shri Ram Janmabhoomi Teerth Kshetra) కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు.
Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyరాజధాని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) అమరావతి రైతులకు చెప్పారు. రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.
Arvind Kejriwal Challenges BJP: మీ సీఎం అభ్యర్థిని తేల్చే దమ్ముందా, బీజేపీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్, విద్యాభ్యాసం లేని అసమర్థుడిని సీఎంగా ప్రకటిస్తారా అన్న ఢిల్లీ సీఎం
Hazarath Reddyమరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly Election) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి (BJP Chief Ministerial Candidate) ఎవరో వెల్లడించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi chief minister Arvind Kejriwal) బీజేపీ పార్టీకి సవాల్‌ విసిరారు. కాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్ చేసిన విషయం విదితమే.
Regional Spices Board Extension: పసుపు 'బోర్డ్' తిప్పేశారు! నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ఎక్స్‌టెన్షన్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్, హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్
Vikas Mandaరైతులు డిమాండ్ చేసింది పసుపు బోర్డ్, ఎన్నికల్లో అరవింద్ హామీ ఇచ్చింది కూడా పసుపు బోర్డ్, అయితే ఇప్పుడు కేంద్రం మాత్రం పసుపు బోర్డ్ కాకుండా ఇప్పటికే నిజామాబాద్ లో ఉన్న కార్యాలయం స్థాయిని విస్తరించింది. బోర్డ్ కంటే ఈ ఎక్స్ టెన్షన్ కార్యాలయంతోనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది....
AAP Manifesto: ఉచిత విద్య, యమునా నది క్లీన్, 24 గంటల విద్యుత్ సరఫరా, ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్, రెండు భాగాలుగా మేనిఫెస్టో విడుదల
Hazarath Reddyఢిల్లి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన మేనిఫెస్టోను(AAP Manifesto) విడుదల చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా(Manish Sisodia) ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పరిశుభ్రమైన తాగు నీరు, 24 గంటల విద్యుత్‌ సరఫరా అందజేస్తామని ఆప్‌ (AAP) తన మేనిఫెస్టోలో పేర్కొంది. యమునా నదిని శుభ్రం చేస్తామని, సిసిటివి నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని ఆప్‌ పేర్కొంది.
Three Capitals Row: రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు, లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖా సహాయమంత్రి
Hazarath Reddyమూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న వేళ పార్లమెంట్‌లో (Parliament) కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధానిపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్(Minister of State for Home Affairs Nithayanada Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Parliament Session: 'గాంధీజీ స్వాతంత్రోద్యమం ఒక డ్రామా' అంటూ బీజేపీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సభలో దుమారం, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
Vikas Mandaగాంధీజీ చేపట్టిన స్వాతంత్య్రోద్యమం అంతా బ్రిటీష్ పాలకులతో ఒక ఒప్పందం ప్రకారం జరిగిన 'సర్దుబాటు' అని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల్లో రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు....
Millennium Tower-B In VIzag: సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్‌ కమిషనరేట్‌
Hazarath Reddyవిశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో (Rushikonda) మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి (Millennium Tower-B In VIzag) ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
National Register of Citizens: ఎన్‌ఆర్‌సీపై కేంద్రం వెనకడుగు? జాతీయ పౌర పట్టిక సిద్ధం చేయడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటుకు తెలిపిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
Vikas Mandaఎన్ఆర్సీని కేవలం బెంగాల్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చేపడతామని షా ఆనాడు అన్నారు. కాగా, నేడు లోకసభ సాక్షిగా హోంమంత్రిత్వ శాఖ సహయ మంత్రి నిత్యానంద్, ప్రభుత్వం ఆ దిశగా ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని పేర్కొనడంతో ఎన్ఆర్సీపై ప్రస్తుతానికి కేంద్రం వెనకడుగు వేసినట్లుగా అర్థమవుతోంది.....
Sagar Mala Project: ఏపీకి 32 రోడ్లు, 21 రైల్ ప్రాజెక్టులు, సాగర మాల ప్రాజెక్ట్ కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 9 జిల్లాల్లో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లు,నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధంగా ఉందన్న కేంద్రం
Hazarath Reddyఏపీకి (Andhra Pradesh) మొన్న బడ్జెట్లో కేటాయింపులపై తీవ్ర నిరాశ వ్యక్తమయిన సంగతి విదితమే.. దీనిపై రాజ్యసభలో ( Rajya Sabha) ఏపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Rajya Sabha member V Vijayasai Reddy) ఏపీకి ఏం కేటాయించారనే ప్రశ్నకు పలువురు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు (Rail Projects) కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) తెలిపారు.
Javadekar vs Kejriwal: 'కేజ్రీవాల్ ఒక టెర్రరిస్ట్, అందుకు ఆధారాలున్నాయి..' దిల్లీ సీఎంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు
Vikas Mandaరవింద్ కేజ్రీవాల్ అమాయకమైన ముఖం పెట్టి నేనేమైనా ఉగ్రవాదినా? అని అడుగుతారు. అవును, నువ్వు ఉగ్రవాదివే, అందుకు అనేకమైన ఆధారాలున్నాయి. గతంలో తానో అరాచకవాదినంటూ కేజ్రీవాల్ తనకు తానే చెప్పుకున్నారు.....
CM YS Jagan Visits Sarada Peetham: విశాఖలో ఏపీ సీఎం, ముఖ్యమంత్రి హోదాలో శారదా పీఠం వార్షికోత్సావాలకు హాజరైన వైయస్ జగన్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు
Hazarath Reddyవిశాఖ జిల్లా (Visakhapatnam) పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి (Sarada Peetham Vaarshik Mahotsav) ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం హోదాలో ఆయన రెండో సారి శారదా పీఠా న్ని సందర్శించారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, (Swarupananda Swamy) స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు.
Teacher Assaulted In WB: మహిళా టీచర్‌పై క్రూరమైన దాడి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ వెళ్లిన టీఎంసీ నేత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Hazarath Reddyమహిళా టీచర్ అని కూడా చూడలేదు. దారుణంగా హింసించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ హేయమైన ఘటన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తెలియడం లేదు. తమ భూమిలో రోడ్డు నిర్మాణం ఏంటని అడిగిన పాపానికి టీచర్ తో పాటు ఆమె చెల్లిని నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన (Teacher Assaulted In WB) ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. టీఎంసీ (TMC) నేతల అరాచకాలను కళ్లముందుకు తీసుకొస్తోంది.
Delhi Assembly Elections 2020: నెలకు రూ.7.500 నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల మంచి నీరు ఉచితం, ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్
Hazarath Reddyఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections 2020) సంబంధించి కాంగ్రెస్ పార్టీ (Congress) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఢిల్లీలో మేనిఫెస్టోని (Congress Manifesto) విడుదల చేశారు.
Pensions Distribution: అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు, తొలిరోజే 76.59 శాతంతో రికార్డు, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమయిందన్న ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం ( pension disbursement programme) సూపర్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు (Ward volunteers) తొలి రోజే రికార్డు సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ (YSR Pension) లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్‌ చేరాలని సీఎం జగన్ ( CM YS Jagan) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Ranjit Bachchan: లక్నోలో కాల్పుల కలకలం, విశ్వహిందూ మహాసభ నేత రంజిత్ హత్య, విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండుగులు, రంగంలోకి దిగిన ఆరు క్రైం బ్రాంచ్ బృందాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో కాల్పుల కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్‌ రంజిత్‌ బచ్చన్‌ను (Hindu Mahasabha leader Ranjit Bachchan) దుండగులు కాల్చి చంపారు.మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్‌ దూసుకుపోవడంతో బచ్చన్‌ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
Prakash Javadekar: ఏపీకి మొండి చేయి చూపిన కేంద్రం, తప్పక న్యాయం జరుగుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyబడ్జెట్‌పై కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రసంశలు గుప్పించారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు.
CAA Row-Vijay Goel: సైకిల్‌పై ఢిల్లీ రోడ్ల మీద బీజేపీ ‘శ్రీమంతుడు’, దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్, సీఏఏ బ్యానర్ కట్టుకుని సైకిల్‌పై పార్లమెంట్‌కి వచ్చిన బీజేపీ ఎంపీ
Hazarath Reddyబిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Delhi Elections-BJP Manifesto: ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం, ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ, ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ
Hazarath Reddyఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను (BJP Election Manifesto)విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ (Manoj Tiwari) నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆప్ (AAP) పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి విదితమే.
Kejriwal Warns PAK Minister: నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని, పాక్ మంత్రికి కేజ్రీవాల్ కౌంటర్, మా ఐక్యతను మీ ఉగ్రవాద దేశం దెబ్బ తీయలేదన్న ఢిల్లీ సీఎం
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister) దిమ్మతిరిగే కౌంటర్ విసిరారు. పాక్ మంత్రి (Pakistani minister Chaudhary Fawad Hussain) భారత ప్రధానిని (PM Modi) కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ కౌంటర్ వేశారు.మోడీజీ భారత ప్రధాని, ఆయన మాకూ ప్రధానమంత్రి. ఢిల్లీ ఎన్నికలు (Delhi elections) భారత అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో ‘ఉగ్రవాద సంస్థ ఆర్గనైజర్’ వేలుపెడితే ఊరుకోబోం’ అని పాక్ మంత్రి ట్వీటుకు ఢిల్లీ సీఎం (Arvind Kejriwal) ధీటైన రిప్లయి ఇచ్చారు. భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలన్ని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేదని చెప్పారు.