Politics

Bomb Blast At Tirupati: తిరుపతిలో బాంబు పేలుడు, ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పేలిన బాంబు, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Hazarath Reddy

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati) బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలుడు (Bomb blast at Tirupati government hospital) జరిగింది. కాగా నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు (Dogs)లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Visakha Utsav 2019: రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, రాజధానిపై ఆచితూచి అడుగులు, విశాఖ ఉత్సవ్ 2019పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Andhra Pradesh Chief Minister YS Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు(Visakhapatnam) వెళ్లారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురుకాగా.. ఈసారి విశాఖవాసులు పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి (Chief Minister)సాదరస్వాగతం పలికారు.

Priyanka Gandhi Heckling Row: పోలీసులపై మండి పడిన ప్రియాంక గాంధీ, గొంతు పట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దంటున్న పోలీసులు, అసలేం జరిగింది ?

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra)లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు. తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని(Priyanka Gandhi Heckling Row) ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు.ఈ వ్యాఖ్యలను లక్నో ఎస్ఎస్పి కలానిధి నైతిని (Kalanidhi Naithini) ఖండించారు. ప్రియాంక గాంధీ గొంతును పోలీసులు పట్టుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.

Hemant Soren: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్, నేడు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం, రాలేనన్న ప్రధాని, హాజరవ్వనున్న ప్రముఖులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Hazarath Reddy

జార్ఖండ్‌ 11వ సీఎంగా జేఎమ్ఎమ్ అధినేత హేమంత్‌ సొరేన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్‌ సొరేన్‌‌తో గవర్నర్ ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హేమంత్‌ సోరెన్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

Rahul Gandhi Attacks BJP: చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అస్సాంలో సాగవు, నాగపూర్ పాలన కుదరదు, అస్సాంలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ, అస్సాంను అస్సామీలే పరిపాలిస్తారంటున్న కాంగ్రెస్ నేత

Hazarath Reddy

అస్సాంలో బీజేపీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిప్పులు (Rahul Gandhi Attacks BJP) చెరిగారు. దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇవాళ గౌహతిలో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ...బీజేపీ (BJP)ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందన్నారు. ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్‌ (Rajul Gandhi) ప్రశ్నించారు. ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదని మండి పడ్డారు.

'Go To Pakistan': వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి, మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్, క్లారిటీ ఇచ్చిన మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్

Hazarath Reddy

మీరంతా వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండంటూ (Go To Pakistan)ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ (Meerut SP )అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు(Anti-CAA Protests) జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

MP Cops Beating Boy: బాలుడిపై చెప్పులతో, కర్రలతో దాడిచేసిన పోలీసులు, నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నా కనికరం చూపలేదు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో,తక్షణ చర్యలకు ఆదేశించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్

Hazarath Reddy

పోలీసులు మరో సారి తమ పైత్యాన్ని చూపించారు. ఓ బాలుడిని గొడ్డును బాదినట్లు బాదారు. ఆ బాలుడు నొప్పులు తట్టుకోలేక ఏడుస్తూ వదిలి వేయమని కాళ్లా వేళ్లా పడినా ఆ పోలీసులు కనికరించలేదు. ఈ వీడియోని ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.మధ్య ప్రదేశ్(Madhya Pradesh)లో జరిగిన ఈ సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ (CM Kamal Nath) తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే చర్యలకు ఆదేశించారు.

Hemant Soren:జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌, ఈ నెల 29న ప్రమాణ స్వీకారం, హాజరవ్వనున్న ప్రముఖులు, బీజేపీని మట్టికరిపించి 47 స్థానాల్లో విజయం సాధించిన జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి

Hazarath Reddy

జార్ఖండ్‌ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha)పార్టీ నాయకులు హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) ఈ నెల 29న జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో పాటు టిఎంసి నాయకులు హాజరు అవుతారని తృణమూల్‌ సీనియర్‌ నాయకులు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీతో హేమంత్‌ సోరెన్‌తో మంచి సంబంధాలను నెరుపుతామని పేర్కొన్నారు.

Advertisement

'The Great CM Yogi': దటీజ్ యోగీ, నిరసనకారులు ఏడుస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు, ట్వీట్ చేసిన యోగీ ప్రభుత్వ కార్యాలయం, మానవ హక్కుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి, యూపీ పోలీస్ చీఫ్‌కు నోటీసులు జారీ చేసిన మానవ హక్కుల కమిషన్

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి(Citizenship Amendment) వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో (Anti-CAA Stir) ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు నిరసనకారులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం ఆరు లక్షల రూపాలయను నిరసనకారులు చెల్లించాలని వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గం ముందుకు వచ్చి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath)తీసుకుంటున్న చర్యలను యూపీ ప్రభుత్వ కార్యాలయం(Yogi Adityanath government) సమర్థించుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదు! సిఎఎ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా శనివారం 'మిలియన్ మార్చ్'ను తలపెట్టిన జేఏసీ, అనుమతిని నిరాకరించిన పోలీసులు, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి ఎలా అనుమతించారని నాయకుల నిలదీత

Vikas Manda

ఏదిఏమైనా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్ బండ్ వద్ద తమ నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు....

AP Cabinet Meet Highlights: అమరావతిపై సస్పెన్స్ కొనసాగింపు, ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తే, వేరే నగరాలతో ఎన్నటికి పోటీపడగలమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్య, చంద్రబాబు హయాంలోని అవినీతిపై విచారణ, కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు

Vikas Manda

గత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ...

AP Cabinet Meet: నేడు అమరావతి భవితవ్యం తేలిపోనుందా? కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, అమరావతి ప్రాంతంలో ఉధృతమైన ఆందోళనలు, జీఎన్ రావు కమిటీపై చర్చించనున్న కేబినేట్, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కూడా చర్చ

Vikas Manda

వెలగపూడిలో రోడ్డుకు అడ్డంగా మహిళలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి, ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, ఆ సమయంలో వచ్చిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలకు గాయాలయ్యాయి....

Advertisement

They Want A Civil War: దేశంలో అంతర్యుద్ధం సృష్టించాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ, అసదుద్దీన్‌లపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజం, ప్రధానిని 'అబద్ధాలకోరు' అనడంపై బీజేపీ అభ్యంతరం, వివాదాస్పదం అవుతున్న నాయకుల వ్యాఖ్యలు

Vikas Manda

విద్యార్థులను రెచ్చగొడుతూ హింసాత్మక ఘటనలకు పాల్పడేలా వారికి నాయకత్వం వహిస్తున్న నాయకులు నిజమైన నాయకులు అనిపించుకోరని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండను రావత్ ఖండించారు. అయితే రావత్ చేసిన ఈ వ్యాఖ్యలను....

PM Modi Sunglasses: నరేంద్ర మోదీ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధర లక్ష రూపాయలపైనే, సూర్య గ్రహణం వీక్షణపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వైరల్, ఆయన ధరించిన నల్ల కళ్లజోడుపై విపరీతమైన చర్చ

Vikas Manda

చాలా మంది భారతీయుల మాదిరిగానే, నేను కూడా 2019 చివరి సూర్యగ్రహణం పట్ల ఆతృతతో ఉన్నాను. దురదృష్టవశాత్తూ, మబ్బుల కారణంగా నేరుగా ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను, కానీ కోజికోడ్‌ మరియు ఇతర ప్రాంతాలలో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలిగాను. నిపుణులతో సంభాషిస్తూ....

Amaravathi Protests: 'మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు, మందడం వద్ద ఉద్రిక్తత, టీడీపి నేతల హౌజ్ అరెస్ట్, రేపటి ఏపీ కేబినేట్ భేటీపై ఉత్కంఠత

Vikas Manda

డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిపై ఏం తేలుస్తారు? అంతకుముందు చెప్పినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?...

Anti-CAA Stir: యోగీ ప్రభుత్వం ప్రతీకార నిర్ణయం, 28 మంది ఆందోళన కారులకు నోటీసులు, వారి నుంచి దాదాపు రూ. 15 లక్షలు రికవరీ చేయాలన్న యూపీ సీఎం, 31 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు (Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల సమయంలో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని నిరసనకారులనుంచి రికవర్‌ చేయడానికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం (Uttar Pradesh government) సమాయత్తమైంది.

Advertisement

Asaduddin Owaisi: ఎన్ఆర్సీని తెలంగాణాలో వ్యతిరేకించండి, సీఎం కేసీఆర్‌ని కోరిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కి తేడా లేదన్న ఎంపీ, ముస్లీం ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలన్న పిలుపుకు అనూహ్య స్పందన

Hazarath Reddy

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ (Asaduddin Owaisi)ఒవైసీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Telangana CM KCR) కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరం బృందంతో కలిసి అసదుద్దీన్ సీఎం కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ కలిశారు.

Ayodhya: అయోధ్యలో బాంబు దాడులకు స్కెచ్, నిఘా వర్గాలు సమాచారంతో అలర్టయిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు, హిందూ-ముస్లింల మధ్య అల్లర్లను రేపేందుకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొత్త స్కెచ్

Hazarath Reddy

అయోధ్య తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం పనులు అక్కడ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా అయోధ్యలో ఆకాశమంత రామాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా కలవరపెడుతోంది.

Gujarat CM Vijay Rupani-CAA: ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే ఉంది, పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసిన గుజరాత్ సీఎం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విజయ్ రూపానీ

Hazarath Reddy

దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు (Citizenship Amendment Act (CAA)మిన్నంటుతున్న నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (Gujarat Chief Minister Vijay Rupani)కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు(Muslims) జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్‌ దేశాలున్నాయని, హిందువులకు(Hindus) మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్‌ సీఎం అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Atal Tunnel: ఇకపై అటల్ టన్నెల్‌గా రోహతాంగ్ టన్నెల్, హిమాచల్‌ను లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లతో కలుపుతున్న అటల్ టన్నెల్, వాజపేయి జయంతి సందర్భంగా అటల్ భూజల్ యోజనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Hazarath Reddy

అటల్ బిహారీ వాజపేయి 95 వ జయంతి (Atal Bihari Vajpayee Birthday) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) రోహ్‌తాంగ్ కారిడాన్‌ను ఆయనకు అంకితం చేశారు. రోహ్‌తాంగ్ మార్గాన్ని ఇకపై అటల్ టన్నెల్‌గా(Atal Tunnel) పిలవనున్నారు. ఈ సొరంగాన్ని అటల్ జీకి అంకితం చేసిన సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ హిమాచల్‌ను లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లతో కలిపే కారిడార్‌ను ఇకపై 'అటల్ టన్నెల్' అని పిలుస్తారని అన్నారు.

Advertisement
Advertisement