రాజకీయాలు

Ashwathama Reddy: అశ్వత్థామరెడ్డికి ఝలక్ ఇచ్చిన ఆర్టీసీ యాజమాన్యం, 6 నెలలు సెలవు కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థన తిరస్కరణ, వెంటనే విధుల్లో చేరాలంటూ సూచన, క్రిస్టియన్‌ ఉద్యోగులకు క్రిస్మస్‌ పండగ సందర్భంగా అడ్వాన్స్

Hazarath Reddy

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ముగిసిన అనంతరం కార్మికులంతా ఉద్యోగాల్లో చేరిపోయారు. సమ్మె ముగిసిన అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి (Ashwathama Reddy) కూడా విధుల్లో చేరారు. అయితే ఆయన విధుల్లో చేరిన వెంటనే 6 నెలలు సెలవు కావాలంటూ ఆర్టీసీ యాజమాన్యానికి (TSRTC) లేఖ రాశారు.

Telangana Encounter: దిశ నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం, ఆదేశించిన తెలంగాణా హైకోర్టు, 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసు (Disha Case) నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. నాలుగు మృతదేహాల అప్పగింతపై శనివారం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కోర్టు పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Operation Dolphin's Nose: భారత సెయిలర్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్న పాకిస్తాన్, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, ఆపరేషన్ డాల్ఫిన్స్‌ నోస్‌ పేరుతో నిఘా పెట్టిన ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్, పోలీసుల అదుపులో 7మంది సెయిలర్స్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) మన దేశ నావికా దళ రహస్యాలను తెలుసుకునేందుకు కుట్ర పన్నింది. అమ్మాయిలను ఎరగా వేసి నావికా దళ సిబ్బందిని (Indian Navy sailors) ముగ్గులోకి దింపుతోంది. మన నావికా దళ సిబ్బందితో సోషల్ మీడియా (Social Media) ద్వారా పరిచయం పెంచుకున్న ఈ అమ్మాయిలు వారితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఆ తర్వాత సెక్స్ చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోని తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారు.

Jaipur Bomb Blast 2008: ఆ నలుగురికి ఉరిశిక్ష, 80 మంది ప్రాణాలను తీసిన ఉగ్రవాదులకు మరణశిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు, మరో ముగ్గురు నిందితులు తీహార్ జైలులో.., ఒకరు నిర్దోషిగా బయటకు..

Hazarath Reddy

2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు(Jaipur Bomb Blast 2008) పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు ( Jaipur special court) మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. 2008 మే నెలలో జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి.

Advertisement

Happy Birthday AP CM YS Jagan: ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 47వ ఒడిలోకి అడుగుపెట్టిన వైయస్సార్ తనయుడు, ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా..,ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు, ఆయనపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు(Happy Birthday AP CM YS JAGAN) జరుపుకొంటున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party)నుండి బయటకు వచ్చి నాన్న ఆశయాల సాధన కోసం వైయస్సార్సీపీ పార్టీని( YSRCP)స్థాపించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు.

Jharkhand Exit Polls 2019: బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమిదే అధికారం, డిసెంబర్ 23న ఫలితాలు, హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్న ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే

Hazarath Reddy

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Assembly Elections 2019) ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది.(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Sonia Gandhi: ప్రజల హక్కులను ప్రభుత్వం పూర్తిగా తొక్కి వేస్తోంది, వారి గోడును అసలు పట్టించుకోవడం లేదు, బీజేపీ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Hazarath Reddy

దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Congress president Sonia Gandhi) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను (video message) విడుదల చేశారు.

GN Rao Committee Full Report: అమరావతిలోనే అసెంబ్లీ..రాజభవన్, విశాఖలో సచివాలయం,సీఎంఓ,వేసవి అసెంబ్లీ,హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ

Hazarath Reddy

గత కొంతకాలంగా ఉత్కంఠగా మారిన ఏపీ రాజధాని అమరావతిపై (AP Capital Amaravathi) ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ (GN Rao Committee) తన నివేదికను ఎట్టకేలకు సీఎం జగన్ కు (CM YS Jagan) సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ( Assembly In Amaravathi), రాజ్‌భవన్‌ (Rajbhavan)..మంత్రుల క్వార్టర్స్ (minister Quarters)ఏర్పాటు చేయాలని....విశాఖలో(Visakhapatnam) సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలు(Kurnool)లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామని తెలిపింది.

Advertisement

AP Capital-Breaking News: ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన

Hazarath Reddy

ఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు.

AP Capital Report: రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై అతి త్వరలోనే సస్పెన్స్ వీడబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

AAP's New Slogan: అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్, మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది.

Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించిన దిల్లీ కోర్టు, బాధితురాలికి పరిహారంగా రూ.25 లక్షలు ఇవ్వాలని ఆదేశం

Vikas Manda

అత్యాచారానికి సంబంధించిన కేసులో గత ఏడాది ఏప్రిల్ 13న కుల్దీప్ సింగ్ అరెస్టయ్యాడు, అప్పట్నించి తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసు కారణంగా బీజేపీ నాయకత్వం ఈ ఏడాది ఆగష్టులో కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరించింది....

Advertisement

KA Occupied MH: 'కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర' ఖచ్చితంగా విముక్తి పొందాలి. ఆ భూభాగాలను మహారాష్ట్రలో కలిపేయాలంటూ బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్న 'మహా' సీఎం ఉద్ధవ్ ఠాక్రే, వివాదాస్పదమవుతున్న వ్యాఖ్యలు

Vikas Manda

1956 తర్వాత దేశంలో మాట్లాడే భాష ప్రతిపాదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ క్రమంలో దక్షిణ మహారాష్ట్రకు చెందిన కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో కలిశాయి. తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రంలోని చాలా వరకు భూభాగం మహారాష్ట్రలో, కర్ణాటకలో కలిసింది....

MP Gorantla Madhav: నిన్ను బజారుకీడ్చిన సంగతి గుర్తించుకో, నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీనయ్యాను, జేసీ దివాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల బూట్లు తుడిచి, ముద్దాడిన వైసీపీ ఎంపీ

Hazarath Reddy

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై (JC Diwakar Reddy) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ మాదవ్ (YSRCP MP Gorantla Madhav) జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు.

Rajinikanth On CAA Row: హింసాకాండతో సమస్యలు సమసిపోవు, పరిణామాలు నన్ను చాలా బాధిస్తున్నాయి, సీఏఏపై రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు, ట్విట్టర్‌లో తలైవా ట్వీటును రచ్చ రచ్చ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని స్వాగతిస్తుంటే మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాక్ట్‌పై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కూడా స్పందించారు.

Telangana Lokayukta: తెలంగాణ లోకాయుక్తగా హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి సీవీ రాములు, మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా జి. చంద్రయ్యలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆమోదం తెలిపిన గవర్నర్

Vikas Manda

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ లోకాయుక్త, ఉప లోకాయుక్త పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలిలో విపక్ష నాయకులు శ్రీ పాషా ఖాద్రీ, శ్రీ జాఫ్రీ ఉన్నారు....

Advertisement

Anti- CAA Protests: నిరసనలతో అట్టుడుకుతున్న భారతదేశం, నిరసనకారుల మధ్య అల్లరిమూకలు, తీవ్ర హింసాత్మకమవుతున 'పౌరసత్వ' ఆందోళనలు, మంగళూరులో జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిరసనకారుల మృతి, దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు

Vikas Manda

కాల్పుల్లో కనీసం ఇద్దరు నిరసనకారులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. పోలీసులు పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ ను తగలబెట్టే ప్రయత్నం చేయడంతోనే...

Disha Case Encounter: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబాలు, రూ.50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్, ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సజ్జనార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు

Vikas Manda

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తమ నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున నష్టపరిహారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని డిమాండ్ చేశారు....

Amaravathi Stir: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రజల ఆందోళన, బంద్ పాటిస్తున్న గ్రామస్తులు, హైకోర్టుకు చేరిన వ్యవహారం

Vikas Manda

సీఎం ప్రకటనపై విశాఖ మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలపై సానుకూలత వ్యక్తం చేస్తుండగా, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు....

Citizenship Amendment Act Protests: దేశవ్యాప్తంగా 'పౌరసత్వ' నిరసనలు, దేశ రాజధాని సహా చాలా చోట్ల 144 సెక్షన్ విధించిన అధికారులు, దిల్లీలో 14 మెట్రో స్టేషన్లు మూసివేత

Vikas Manda

దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈరోజంతా ప్రణాళికాబద్ధమైన నిరసనల కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో పొలీసులు ధర్నాలు జరిగే అవకాశం ఉన్నచోట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు....

Advertisement
Advertisement