Politics

AP Assembly Session 2nd Day Highlights: నేను 25 ఏళ్ళ యువకుడ్ని,మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు, రాజీనామాకు సిద్ధమంటూ సవాల్, ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్, అన్నీ అమలు చేసి తీరుతామన్న ఏపీ సీఎం జగన్ 

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) అసెంబ్లీ శాసన సభ సమావేశాలు రెండో రోజూ(AP Assembly Session 2nd Day) యుద్ధాన్నే తలపించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra babu)గతంలో సీఎంగా ఉన్న సమయంలో రైతులను నిలువునా ముంచారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ (Nara lokesh)ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే సెటైర్లు వేశారు.

Uddhav Thackeray: లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Hazarath Reddy

బీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకు వస్తున్న పౌరసత్వ బిల్లుపై(Citizenship Amendment Bill 2019) శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు.

Polavaram Project: కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి, రాజ్యసభలో ఎంపి కెవీపీ రామచంద్రరావు, పోలవరంపై తెలుగులో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్,ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌

Hazarath Reddy

పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు(YCP MP KVP Ramachandra rao), బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(BJP MP GVL Narasimha rao) రాజ్యసభలో(Rajyasabha) పోలవరం(Polavaram Project) అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.

Adhir Ranjan Chowdhury: ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, రేప్ ఇన్ ఇండియా, ప్రధాని మోడీ మహిళా నేరాల గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు, దేశం లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందన్న అధిర్ రంజన్ చౌదరి

Hazarath Reddy

దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఫైర్ అయ్యారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్‌ ఇండియా దిశగా కాకుండా రేపిన్‌ ఇండియా(Make In India To Rape In India) వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు.

Advertisement

Military Plane Missing: 38 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, అసలేం జరిగింది ?

Hazarath Reddy

చిలీ (chile) దేశ‌ వైమానిక ద‌ళానికి చెందిన విమానం అదృశ్య‌మైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేదు. అంటార్కిటికా వెళ్తున్న‌రూట్లో ఆ విమానం (Military Plane Missing)ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సీ-130 హెర్క్యూల్స్(C-130 Hercules) ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం ఆరు గంట‌ల‌కు విమానం మిస్సైంది.

Woman Lives In Toilet: మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది ?, ఒడిశాలో ఓ మహిళ ఆవేదన, మేము ఏమీ చేయలేమంటున్న సర్పంచ్

Hazarath Reddy

దేశం ఆర్థికంగా ముందుకు వెళుతున్నా సామాన్యలు జీవితాల్లో ఎటువంటి మార్పు కానరావడం లేదు. నాయకుల హామీల మూటలు పేపర్లకే పరిమితమవుతున్నాయి. కనీసం కూడు గూడు అనేవి కూడా వారికి గగనం అయ్యే పరిస్థితులు కళ్ళముందు కదలాడుతున్నాయనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒడిశా(odisha)లోని ఒక గిరిజన మహిళ (tribal woman)ఉండటానికి ఇల్లు లేక, కొనేందుకు డబ్బులు లేకపోవడంత మూడేళ్లపాటు మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది.

Quality Rice Distribution In AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, అసెంబ్లీలో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి, నాలెడ్జ్ అంశం మీద ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కొడాలి నాని కౌంటర్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో సన్నబియ్యంపై(Quality Rice) చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ (TDP vs YCP)సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (MLA Acchem Naidu) ప్రశ్నించారు. ముందు సన్న బియ్యం అన్నారు.

US Commission On CAB 2019: పౌరసత్వ సవరణ బిల్లుపై యూఎస్ ఫెడరల్ కమీషన్ ఆందోళన, అమిత్ షా సహా భారత అగ్ర నాయకత్వంపై అమెరికా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని సూచన

Vikas Manda

తమ అంతర్గత వ్యవహారాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని మోదీ సర్కార్ గతంలోనే చాలా సార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు USCIRF చేసిన ఆరోపణలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మత స్వేచ్ఛపై సమీక్ష చేసేందుకు భారత్ వస్తామని తెలిపిన USCIRF సభ్యులకు పలు మార్లు వీసా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది....

Advertisement

Speaker vs TDP: అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు, సభ్యుల గొంతు నొక్కితే ఊరుకోను, ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంలో నేను భాగమే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకి సీటు కేటాయిస్తాం, టీడీపీ ఆరోపణలపై మండిపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session 2019) రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ(Assembly)ని వైఎస్సార్‌సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని, ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు.

Citizenship Amendment Bill 2019: పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో అర్ధరాత్రి ఆమోదం, అసలు పరీక్ష రాజ్యసభలో, తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో తారాస్థాయికి నిరసనలు 

Vikas Manda

ఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (NESO) మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈశాన్యంలో చాలా చోట్ల బంద్ కు పిలుపునిచ్చారు....

Vamsi Fires On Chandrababu: పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు, జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు, నేను టీడీపీతో ఉండలేను, అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఫైర్

Hazarath Reddy

అసెంబ్లీ(AP Assembly Session)లో రెండో రోజు వాడీ వేడీ చర్చ మొదలైంది. ఈ సంధర్భంగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)పై అలాగే టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సభలో మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాట్లాడటానికి వీళ్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు.

AP Assembly Session: ఈరోజు అసెంబ్లీ సమావేశంలో హైలెట్స్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హ్యాట్సాప్ అన్న ఏపీ సీఎం, మా మద్దతు మీకు ఉంటుందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పేలిన పంచులు, మొత్తం వారం రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Session) రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేతలు ఉల్లి ధరల (Onion Price)పై చర్చించాలని పట్టుబట్టారు. కాగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ (TDP) నుంచి 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీతో సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ అసెంబ్లీకి రాలేదు.

Advertisement

Siddaramaiah Resigns: కర్ణాటకలో విరబూసిన కమలం, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్దరామయ్య రాజీనామా, 12 స్థానాల్లో బీజేపీ విజయం, రెండు స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం

Hazarath Reddy

కర్ణాటకలో రాజకీయ వేడి మొదలైంది. కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly constituencies) జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress),జేడీఎస్(JDS) పార్టీలకు ఓటర్లకు భారీగా షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ(BJP) దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు.

Hyderabad Encounter Case: ఆ నలుగురి మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు భద్రపరచాలంటూ హైకోర్ట్ ఆదేశం, విచారణ గురువారానికి వాయిదా, బుధవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

Vikas Manda

ఎన్ కౌంటర్ పై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, నలుగురు క్రిమినల్స్ ను చంపితే వ్యవస్థలు స్పందించే తీరును, వ్యవస్థలలోని లొసుగొలను అడ్డుపెట్టుకొని కొన్ని వర్గాల వారు కల్పిస్తున్న చిక్కులను చూసి అదే ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.....

Citizenship Amendment Bill 2019: 'మత రాజకీయాలు ఆపండి', విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన హోంశాఖ మంత్రి అమిత్ షా

Vikas Manda

మార్చి 24, 1971 తరువాత దేశంలోని ప్రవేశించిన వలసదారులను తిరిగి వారి దేశాలకు వెనక్కి పంపేందుకు, 1985, అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు....

Onion War In AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి, ఉల్లిపై చర్చను చేపట్టాలన్న ప్రతిపక్షం, హెరిటేజ్‌ షాపులో రూ. 200కి ఎందుకు అమ్ముతున్నారన్న ఏపీ సీఎం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామన్న వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly winter session) తొలిరోజు వాడి వేడీగా జరుగుతున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ (TDP)నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఉల్లి ధరల(Onion Price)పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

Advertisement

BJP Leader Gokaraju Gangaraju: ఏపీలో బీజేపీకి వైసీపీ షాక్, నర్సాపురం బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి వల, ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలో కండువా కప్పుకోనున్న గంగరాజు, వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఝలక్ తప్పదా ?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పార్టీ మార్పులతో ఊహించని విధంగా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని(Gannavaram MLA Vallabhaneni vamsi) వంశీతో రాజకీయాలు వేడెక్కగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది.

AP Winter Assembly Session: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ, ఉల్లితో చంద్రబాబు నిరసన, మోడీని మోసం చేశారంటున్న వైసీపీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.

Karnataka Bypoll Results 2019: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, ఊపిరి పీల్చుకునే దిశగా బీజేపీ, సిట్టింగ్ స్థానాలను కోల్పోయే దిశగా కాంగ్రెస్, జేడీఎస్, 10 స్థానాల్లో బీజేపీ లీడింగ్

Hazarath Reddy

కర్ణాటక(Karnataka)లో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. అధికార బీజేపీ(BJP)కి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు ఆసక్తి రేకెత్తించింది.ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్‌(JDS), కాంగ్రెస్‌(Congress)లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

Pawan Kalyan: మీ వల్లే నేను ఓడిపోయాను, మీరు సరిగా ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, కార్యకర్తలపై మండిపడిన పవన్ కళ్యాణ్, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని హితవు, రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.

Advertisement
Advertisement