రాజకీయాలు

Indian Army Advisory: వాట్సప్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి, సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ, వాట్సప్ లో ఎటువంటి సమాచారం పంపొద్దని హెచ్చరిక

Hazarath Reddy

ఇండియాకు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ గూఢాచారి సంస్థ (Pakistani Intelligence Operatives) ఐఎస్ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ( Indian Army) తమ సిబ్బందికి కీలక సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది.

Maharashtra Battle: సుప్రీంకోర్టుకు చేరిన 'మహా' రాజకీయం, ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌, దాఖలు చేసిన మహారాష్ట్ర వికాస అఘాడి కూటమి, గవర్నర్ నిర్ణయంపై ఆగ్రహం

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి(Devendra Fadnavis and Ajit Pawar)గా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.

Who Is Ajit Pawar: అజిత్ పవార్ ఎవరు? అతని ప్రస్థానం ఏంటీ? అతనిపై ఉన్న ఆరోపణలు,కేసులు ఏంటీ? మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

అజిత్ పవార్ (Ajit Pawar).. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ (COngress) పార్టీలకు షాకిస్తూ బీజేపీ(BJP)ని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన 60 ఏళ్ల అజిత్ పవార్ ఎన్సీపీ నేత, శరద్ పవార్ (Sharad Pawar) అన్న కుమారుడు. ట్విస్టుల మధ్య సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీ రోల్ పోషించి బీజేపీకి అధికారాన్ని అందించాడు. తమ అధినేత శరద్ పవార్‌ను ధిక్కరించి బీజేపీకి జై అన్నాడు.

‘Modi Hai Toh Mumkin Hai’: మోడీ ఉంటే అన్నీ సాధ్యమే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Sanjay Raut Intersting Comments: అజిత్ పవార్ మళ్లీ తిరిగివస్తాడు, జైలుకు వెళతాననే భయంతోనే బీజేపీకి మద్ధతు ఇచ్చాడు, అతని వెంట 8 మంది ఎమ్మెల్యేలు వెళితే 5 మంది తిరిగివచ్చారు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్ర(Maharashtra )లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలో అధికార ఏర్పాటు మేమే చేస్తామని ఆదినుంచి చెబుతూ వస్తున్న సంజయ్ రౌత్ (Sanjay Raut) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి అజిత్ పవార్ (Ajit Pawar feared going to jail) బీజేపీకి మద్దతు ఇచ్చాడన్నారు.

NCP MP Supriya Sule: పార్టీతో పాటు, కుటుంబంలోనూ చీలిక వచ్చింది, శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రతి ఎన్సీపీ కార్యకర్త పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె (NCP's Supriya Sule) తన వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status)లో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు. 'పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక వచ్చింది'(Party And Family Split) అని అన్నారు. ఈ వాట్సప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు.

NCP Chief Sharad Pawar: అజిత్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు, బల నిరూపణలో బీజేపీ ఓడిపోతుంది, బల నిరూపణ తరువాత మూడు పార్టీలు కలిసి అధికారం ఏర్పాటు చేస్తాయి, మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడి

Hazarath Reddy

మహా రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి. తమ పార్టీకి ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖను ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఇచ్చారని బీజేపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Nationalist Congress Party (NCP) chief Sharad Pawar) వివరణ ఇచ్చారు.

Maharashtra Assembly Floor Test: సీఎం తంతు పూర్తయింది, బల నిరూపణే మిగిలి ఉంది, సీఎం ఫడ్నవిస్ బలనిరూపణలో నెగ్గుతారా, శివసేన, ఎన్సీపీ వ్యూహ రచన ఎలా ఉండబోతోంది ?

Hazarath Reddy

అనుకోని మలుపులతో సాగుతూ వచ్చిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలకు బీజేపీ శుభం కార్డు వేసింది. రాత్రికి రాత్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్‌ నేతలతో పాటు శరద్‌ పవార్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చిన అజిత్‌ పవార్ (NCP's Ajit Pawar) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

Advertisement

Sharad Pawar: బీజేపీకి మేము మద్దతు ఇవ్వలేదు, అజిత్ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయం, అజిత్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం లేదు, మీడియా సమావేశంలో పూర్తి వివరాలు చెబుతానన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్

Hazarath Reddy

రాత్రికి రాత్రే మారిన మహారాష్ట్ర రాజకీయ తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (NCP's Sharad Pawar) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP)కి మద్దతునివ్వడం తన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ’ఈ రోజు ఉదయం ఏడు గంటలకే నాకు ఈ విషయం తెలిసింది. అజిత్‌ పవార్‌ ఇలా చేస్తాడని నాకు తెలియదు. నేను త్వరలోనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను. ఉద్ధవ్‌ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడతారు. అప్పుడే అన్ని విషయాలు వివరంగా చెబుతాను’ అని పేర్కొన్నారు.

Sanjay Raut Criticizes Ajit Pawar: అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు, తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు, మహా ట్విస్టుపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

గత కొంతకాలంలో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మహా సీఎం రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో ముగిసాయి. రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis was sworn in as Maharashtra chief minister )చేశారు. దీంతో శివసేన ఒక్కసారిగా షాక్ కు గురయింది. మహారాష్ట్ర సీఎం అంశం మీద ఆది నుంచి మీడియాకు ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూ వచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay raut)ఈ విషయం మీద స్పందించారు.

Fadnavis Takes Oath As 'MAHA' CM: రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు, మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Hazarath Reddy

గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలకు ఎండింగ్ కార్డు పడింది. అక్కడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాత్రికి రాత్రే పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ నుంచి విబేధాలతో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న శివసేనకు ఎన్సీపీ భారీ షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో జట్టు కట్టిన బీజేపీ ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

All Bars License Cancelled In AP: ఏపీలో మద్యపానం నిషేధానికి మరో కీలక అడుగు, అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేసిన ఏపీ సీఎం జగన్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ

Hazarath Reddy

రిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (Ap CM YS Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మద్యపాన నిషేధానికి బాటలు వేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Maharashtra Government Formation: రాష్ట్రపతి పాలనకు ముగింపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే, రేపు అధికారిక ప్రకటన, రాష్ట్రంలో కొలువుదీరనున్న బీజేపీయేతర ప్రభుత్వం

Vikas Manda

ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఒక పార్టీకి లేదా కూటమికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఇప్పుడు శివసేన 56 + ఎన్సీపీ 54+ కాంగ్రెస్ 44 కలిస్తే మొత్తం 154 సీట్లు అవుతున్నాయి.....

Suspense Continues Over 'MAHA' CM: అయిదేళ్లు శివసేన నుంచే మహారాష్ట్ర సీఎం, రేసులో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అరవింద్‌ సావంత్‌, చర్చల అనంతరం సీఎంపై కీలక ప్రకటన,వెల్లడించిన సంజయ్ రౌత్

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra)లో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం చేజిక్కుంచుకునే దిశగా శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్‌ (Congress) చేసిన ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.

Chennamaneni Ramesh Case: చెన్నమనేని భారత పౌరసత్వం రద్దుపై హైకోర్ట్ స్టే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఊరట

Vikas Manda

చెన్నమనేని రమేశ్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైకోర్ట్ సూచించిన మార్గదర్శకాలు పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా తన పౌరసత్వాన్ని రద్దు చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్ట్ కేంద్ర ప్రకటనపై స్టే విధిస్తూ ....

Tomato price In Pakistan: పాకిస్తాన్‌లో టమోటా ధర కిలో రూ. 400, రూ.100కు నాలుగు టమోటాలు,లబోదిబోమంటున్న పాక్ ప్రజలు,ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాయాది దేశం

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌(Pakistan)లో టమాట ధరలు (Tomato Price In Pak) ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా కరాచీ (Karachi) నగరంలో బుధవారం కిలో టమాట ధర రూ.400 పలికింది. కొన్ని ప్రధాన మార్కెట్లలో కిలో దాదాపు రూ. 350 నుంచి రూ. 380 మధ్యలో పలికింది.

Advertisement

Rajinikanth Intersting Comments: 2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు, కమల్‌తో పొత్తుపై మాటను దాటవేసిన తలైవార్, ఆ అధ్భుతం మళ్లీ మేము అధికారంలోకి రావడమేనన్న తమిళనాడు సీఎం పళని స్వామి

Hazarath Reddy

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ఈ మధ్య రాజకీయాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న బీజేపీ మీద విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోమారు రాజకీయాలపై తన మనసులోని మాటను బయటపెట్టారు.

Maharashtra Vikas Aghadi: 'మహా'లో మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడి కూటమి, అధికార ఏర్పాటుకు తెరుచుకున్న దారులు, పదవుల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటు(Maharashtra government formation)కు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌(Shiv Sena, NCP and Congres) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుదిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నాలుగైదు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం ఉన్నది.

Anti Corruption Issue: అవినీతిపై ఏపీ సీఎం జగన్ ఉక్కుపాదం, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో అవగాహన ఒప్పందం, ఏసీబీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో జగన్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

Hazarath Reddy

స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement