Politics
Eknath Shinde On CM Post: సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు, పోరాటం నా రక్తంలోనే ఉంది...సీఎం పదవి విషయంలో మోదీ నిర్ణయమే ఫైనల్
Arun Charagondaసీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు పోరాటం నా రక్తంలోనే ఉంది షిండే నేను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదు అన్నారు. ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగానని... ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కార్యకర్తలకు ధన్యవాదాలుఅభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయన్నారు.
SC Dismisses Plea for Ballot Paper: పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
Hazarath Reddyపేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేఏ పాల్ .. సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. నేడు జస్టిస్ విక్రమ్ నాథ్, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ తర్వాత ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!
Arun Charagondaమహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు ఏక్‌నాథ్ షిండే. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే కేర్ టేకర్ సీఎంగా కొనసాగనున్నారు.
Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
Arun Charagondaనవంబర్ 26.. భారత రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ప్రతి ఏటా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘I Have Not Resigned’: నేను పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయలేదు, వార్తలను ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పటోలే ఖండించారు.
Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు
Hazarath Reddyవైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.
Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Hazarath Reddyసోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్
Hazarath Reddyవిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డాయి. సెషన్ ఇప్పుడు నవంబర్ 27, బుధవారం తిరిగి సమావేశమవుతుంది.
Nana Patole Resigns: మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు వెల్లడి
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్ (Maharashtra Congress chief) నానా పటోల్ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Parliament Winter Session 2024: పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి నవంబర్ 25న పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పసుపు కుర్తా, తెల్ల లుంగీ ధరించి నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ఎంపీ వచ్చారు.
Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం
Hazarath Reddyరాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.
Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం
Rudraపార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో
Hazarath Reddyగత కొంత కాలంగా మహారాష్ట్రతో పాటు, దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.
Jharkhand Election Result 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్ సొరేన్, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి
Hazarath Reddyజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సొరేన్‌కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు.56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది.
Divvela Madhuri: పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు
Hazarath Reddyపవన్ కళ్యాణ్‌పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దువ్వాడ తరఫున పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది
Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో 21 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నిక, ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కరు గెలుపు
Hazarath Reddy288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 21 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, వారిలో ఒక్కరు మాత్రమే ప్రతిపక్షం నుంచి గెలుపొందినట్లు పోల్ ఫలితాల్లో వెల్లడైంది.
Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎంకు ఎదురుదెబ్బ, కేవలం ఒక స్థానానికే పరిమతమైన పార్టీ, ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది శాసనసభకు ఎన్నిక
Hazarath Reddyఅసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం నవంబర్ 23న వెల్లడైన తర్వాత మొత్తం 10 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు.
Assembly Elections Results 2024: మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష నేత లేకుండా అసెంబ్లీ, అన్ని పార్టీలను ఊడ్చిపారేసిన బీజేపీ కూటమి
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు
Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..
Hazarath Reddyమొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా కాంగ్రెస్ కూటమి దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 15, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ కోఠే (వీడియో)
Rudraఅసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.