Politics

Divvela Madhuri: పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దువ్వాడ తరఫున పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో 21 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నిక, ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కరు గెలుపు

Hazarath Reddy

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 21 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, వారిలో ఒక్కరు మాత్రమే ప్రతిపక్షం నుంచి గెలుపొందినట్లు పోల్ ఫలితాల్లో వెల్లడైంది.

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎంకు ఎదురుదెబ్బ, కేవలం ఒక స్థానానికే పరిమతమైన పార్టీ, ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది శాసనసభకు ఎన్నిక

Hazarath Reddy

అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం నవంబర్ 23న వెల్లడైన తర్వాత మొత్తం 10 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు.

Assembly Elections Results 2024: మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష నేత లేకుండా అసెంబ్లీ, అన్ని పార్టీలను ఊడ్చిపారేసిన బీజేపీ కూటమి

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు

Advertisement

Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

Hazarath Reddy

మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా కాంగ్రెస్ కూటమి దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్‌ 15, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ కోఠే (వీడియో)

Rudra

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్‌ కోఠే తెలిపారు.

PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్

Arun Charagonda

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌ చేశారు . ఎన్నిక‌ల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మ‌హారాష్ట్రలోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు ముఖ్యంగా యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు..మ‌హారాష్ట్ర అభివృద్ధికి మ‌హాయుతి కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు. జార్ఖండ్‌లో విజ‌యం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూట‌మికి అభినంద‌న‌లు తెలిపారు మోదీ.

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Arun Charagonda

వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ...తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను అన్నారు. మీ కోసం పోరాడుతాను అని వెల్లడించారు.

Advertisement

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Arun Charagonda

ప్రియాంక గాంధీ...రికార్డు తిరగరాశారు. వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు ప్రియాంక. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు.

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని మట్టికరిపిస్తూ ఎన్డీయే కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, శరద్ పావ్, ఉద్దవ్ ఠాక్రేలకు ఘోర పరాజయం ఎదురుకాగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఏక్‌నాథ్ షిండే. అయితే సీఎం పదవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Jharkhand Election Results: జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా, 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి..మేజిక్ ఫిగర్‌ను దాటిన జేఎంఎం

Arun Charagonda

జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 81 స్థానాలకు గాను 50కి పైగా స్థానాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా జేఎంఎం కూటమి దూసుకెళ్తోంది.

Sanjay Raut: ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ప్రజలు ఈ తీర్పును అంగీకరించని కామెంట్

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన( ఉద్దవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్. ఇది ప్రజా నిర్ణయం కాదని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని అమోదించరన్నారు. అజిత్ పవార్, షిండే వర్గం చేసిన మోసంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మాకు తెలుసు అన్నారు.

Advertisement

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Rudra

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌ సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి.

Chandrababu: వీడియో ఇదిగో, నేను ఐదోసారి సీఎం అవుతా, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Hazarath Reddy

AP రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు.

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

Hazarath Reddy

ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు ఏపీ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. దీంతో పాటుగా చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది.

Advertisement

Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి

Hazarath Reddy

.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Hazarath Reddy

కెనడాలో నేర కార్యకలాపాలతో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది.

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

ప్రజా పద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

Pawan Kalyan Hugs Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్సను కౌగిలించుకున్న పవన్ కళ్యాణ్, పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పవన్‌ను బొత్స ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement