Politics

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, రూ. 5 కోట్ల నగదుతో హోటల్‌లో పట్టుబడ్డ బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే విరార్‌లోని ఓ హోటల్‌లో 5 కోట్ల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024కి ఓటు వేయడానికి ముందు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన డబ్బు అని నివేదించబడింది.

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన UK కౌంటర్‌పార్ట్ లో భాగంగా బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన కైర్ స్టార్‌మర్‌తో జరిగిన సమావేశంలో, UK నుండి రప్పించడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఆర్థిక నేరస్థుల సమస్యను ప్రస్తావనకు తీసుకువచ్చారు

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్‌ చర్చలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేష్‌ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు

Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

Hazarath Reddy

ఆయనపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు.

Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. జాతుల మధ్య వైరంతో గతేదాడి నుంచి అక్కడ కల్లోల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా పట్టుకుపోయారు.

Advertisement

Kailash Gehlot Joins BJP: వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్‌ గహ్లోత్‌, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే.

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

PM Modi: నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ

Arun Charagonda

నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు నైజీరియా ఈ అవార్డును ప్రధానం చేసింది. ఈ అవార్డుతో విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వది.

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో ప్రస్తావించారు కైలాష్ గెహ్లాట్. కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయించిందని, ఈ క్రమంలో ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు అని ఆరోపించారు.

Advertisement

CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

PM Modi: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం..జార్ఖండ్ నుండి ఢిల్లీకి రావడంలో ఆలస్యం

Arun Charagonda

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి చేరడానికి ఆలస్యమైంది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన అనంతరం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. జార్ఖండ్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

Raghurama Krishna Raju: వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Hazarath Reddy

రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.

Advertisement

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు.

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిల తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. బడ్జెట్ మీద జగన్ ప్రసంగించిన తరువాత ఆమె వైసీపీ అధినేత వ్యాఖ్యలపై మండిపడింది.

Advertisement
Advertisement