రాజకీయాలు
Nara Lokesh on Talliki Vandanam Scheme: వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.
Andhra Pradesh Assembly Session: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
Hazarath Reddyశాసనసభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ శాసనసభలో చర్చ జరుగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనబడుతోందన్నారు
YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వైసీపీ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. జంతర్ మంతర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు చేపట్టిన ధర్నాకు జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సమాజ్ వాది పార్టీ ఎంపి అఖిలేష్ యావ్ ఇప్పటికే మద్దతు తెలిపారు. తాజాగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపారు
YSRCP Protest in Delhi: రేపు మేము అధికారంలోకి వస్తాం, ఢిల్లీ వేదికగా జగన్ మాస్ వార్నింగ్, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీలకు వైసీపీ అధినేత విజ్ఞప్తి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం.
YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మండిపడిన జగన్
Hazarath Reddyఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి రాగలం.. నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
YSRCP Protest in Delhi: విజయసాయి రెడ్డి కథను పక్క దారి పట్టించేందుకే ఈ ధర్నా, వైసీపీ నిరసనపై మండిపడిన టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో దాడులకు నిరసనగా వైసీపీ చేపట్టిన ధర్నాపై టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్‌లన్నీ టీడీపీపైనే నిందిస్తున్నానని, ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా అవి టీడీపీనే చేయించినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019-2024 వరకు వైఎస్ జగన్ హయాంలో హింస, హత్యలు జరిగాయన్నారు.
YSRCP Protest in Delhi: దాడులు మంచివి కావు, రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు, వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తారు. టిడిపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు.
Andhra Pradesh: ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyశాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు.
Union Budget 2024: ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చి అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తాం, అప్పుగా ఇస్తున్నారా, నిధులా అనే అంశంపై స్పష్టత ఇచ్చిన నిర్మలా సీతారామన్
Hazarath Reddyకేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ 15 వేల కోట్లు కేంద్రం కేటాయించడం తెలిసిందే. అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు
Vijayasai Reddy on TDP: రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపాటు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందంటూ..
Hazarath Reddyఏపీలో దాడులపై ఎక్స్ (ట్విటర్) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు.
Andhra Pradesh: వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్, అప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Andhra Pradesh Assembly Session: వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు.
CM Revanth Reddy on Budget: ప్రధాని మోదీకి ఎందుకింత కక్ష, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
CM Chandrababu on Budget: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyకేంద్ర బడ్జెట్‌లో (Budget 2024) ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrabau Naidu)ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి కోసం బడ్జెట్‌లో పెట్టారన్నారు.
Telangana Assembly Session: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25వ తేదీన బడ్జెట్, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Andhra Pradesh Assembly Session: రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు.
Union Budget 2024: బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
Hazarath Reddyకేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Budget 2024: విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40 నుంచి 35 శాతానికి తగ్గింపు, కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
Hazarath Reddyఐటీఏటీకి పన్ను అప్పీళ్లకు ద్రవ్య పరిమితి రూ. 60 లక్షలకు, హైకోర్టులకు రూ. 2 కోట్లు మరియు సుప్రీంకోర్టుకు రూ. 5 కోట్లకు పెంచబడిందని తెలిపారు. అన్ని తరగతుల పెట్టుబడిదారులకు రద్దు చేసిన ఏంజెల్ పన్నును రద్దు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40 నుంచి 35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
Budget 2024: ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు
Hazarath Reddyఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
Budget 2024 Highlights: నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవిగో, ఏపీకి వరాల జల్లులు కురిపించిన కేంద్రం, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ ఇవే..
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. తద్వారా వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు.