Politics

Andhra Pradesh Elections 2024: సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసిన టీడీపీ, దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్సన, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు

Hazarath Reddy

ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు

Inner Ring Road Scam: హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారనే వార్తలు ఫేక్, రూమర్స్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ

Hazarath Reddy

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ వస్తున్న కథనాలను ఏపీ సీఐడీ ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి, భావోద్వేగాలకు గురైన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.

Andhra Pradesh Elections 2024: వైసీపీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా, వైసీపీ టికెట్ రాకపోవడంతో కుమారుడితో కలిసి పార్టీకి రాజీనామా

Hazarath Reddy

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

Advertisement

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, కర్ణాటకలో రూ. 5 60 కోట్ల నగదు, 106 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి (Bellary)లో ఓ నగదు వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.5.6 కోట్ల నగదు, 106 కేజీల బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.

Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్‌లో పవన్‌కు బిగ్‌ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్‌, ఏ పార్టీలోకి వెళతారంటే..

Hazarath Reddy

జనసేన పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పోతిన వెంకట మహేష్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఓ లేఖ విడుదల చేశారు. జనసేనకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరణ

Rudra

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

Congress Complaints to EC on KCR: ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను దూషిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

Rudra

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఉపాధ్యక్షుడు నిరంజన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఉండిలో చంద్రబాబుపై భగ్గుమన్న కార్యకర్తలు, ఎమ్మెల్యే టికెట్ రఘురామకు కాకుండా రామరాజుకే ఇవ్వాలని ధర్నా, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Secunderabad Cantonment Assembly By Elections: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల అభ్యర్థిగా శ్రీగణేష్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌

sajaya

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

Andhra Pradesh Elections 2024: నేను సీఎం అయితే ఏపీ రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హమీ

Hazarath Reddy

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు.

Rameshwaram Cafe Blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బీజేపీ కార్యకర్త అరెస్ట్, సాయిప్రసాద్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తను అరెస్టు చేసినట్లు శుక్రవారం నివేదికలు పేర్కొన్నాయి. రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనలో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్‌ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు

Hazarath Reddy

కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్‌టాప్‌, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్‌ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనుంది. వచ్చే వారం తీహార్‌ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది

MLA Danam Nagender on IPL Tickets: పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్

Hazarath Reddy

ఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.

KCR Meets Farmers: రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపిన కేసీఆర్, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు

Andhra Pradesh Elections 2024: కడప జిల్లా నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన వైఎస్ షర్మిల, యాత్రలో పాల్గొన్న వైఎస్ వివేకా కూతురు సునీత, అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపు

Hazarath Reddy

కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు

Advertisement

Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్‌, అందుకే మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్‌ ఇచ్చింది, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్‌ ఇచ్చారని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారని అన్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్‌ ఆధారాలు లేవు.

Lok Sabha Elections 2024: పేద మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్ష, పాంచ్ న్యాయ్ సూత్రాలతో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలు 2024లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress) మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది.

Skill Development Scam: ఎన్నికల వేళ చంద్రబాబు మెడకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఉచ్చు, ఏ1గా టీడీపీ అధినేతను పేర్కొంటూ 41 మందిని నిందితులగా పేర్కొన్న సీఐడీ

Hazarath Reddy

ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

Telangana Elections 2024: తెలంగాణ నుంచి పోటీ చేసే 17 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే, మెదక్ నుంచి రఘునందన్ రావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్

Hazarath Reddy

వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన అభ్యర్థును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో నిలవగా హైదరాబాద్ నుంచి మాధవీ లత, మల్కాజ్ గిరి నుంచి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.

Advertisement
Advertisement