Politics

Delhi Excise Policy Case: అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ ఏప్రిల్‌ 1 వరకు పొడిగింపు, రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ ఇలా చేస్తుందని ఢిల్లీ సీఎం మండిపాటు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం విధానం కేసు(Excise policy case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు న్యాయస్థానం పొడిగించింది.కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది.

Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్నా ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారు, పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు, నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సంగతి విదితమే. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే ఢిల్లీ సీఎంగా కొనసాగనున్నారు. పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తిరస్కరించింది.ఆయన ఈడీ కస్టడీలో ఉన్నా సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత డబ్బు నా దగ్గర లేదు, అందుకే పోటీ చేయడం లేదు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు, ఏపీ గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని అభ్యర్థిస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు (JP Nadda) తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని మంత్రి (Nirmala Sitharaman) తెలిపారు.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, 14 మందితో ఎనిమిదో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది, మధ్యప్రదేశ్‌లోని గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావు యద్వేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: అనపర్తిలో సైకిల్‌ని మంటల్లో పడవేసి నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలు, టికెట్ బీజేపీకి కేటాయించడంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి విభేధాలు భగ్గుమన్నాయి. కూటమిలో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పడుకుని భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ

Hazarath Reddy

బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాసవర్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురైన ఆయన్ని కార్యకర్తలు ఓదార్చారు. ఆయన ఎక్స్ లో షేర్ చేసిన పోస్టులో 30 సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

MP Ganeshamurthi Passes Away: లోక్‌ సభ ఎన్నికల టిక్కెట్టు రాలేదని తమిళనాడు ఎంపీ ఎ. గణేశమూర్తి మనస్తాపం.. ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నేడు మృతి

Rudra

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ, ఎం‌డీఎంకే నేత ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.

CM Jagan on Viveka Murder: చిన్నాన్న వివేకాను చంపినోడిని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో

Advertisement

Andhra Pradesh Elections 2024: మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు, మీరంతా సిద్ధమేనా అంటూ ప్రొద్దుటూర్‌ సభలో గర్జించిన సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది. మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా. మీ అంతా సిద్ధమేనా? అని అన్నారు.

Andhra Pradesh Elections 2024: చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, చంద్రబాబు మరో సంచలన ప్రకటన, ప్రజాగళంలో వైసీపీపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీడీపీ అధినేత

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి,పలమనేరు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు

Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, ఏపీలో బీజేపీ నుంచి పోటీ చేసే 10 మంది అసెంబ్లీ అభ్యర్థులు లిస్టు ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

Delhi Liquor Policy Case: సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు, తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఈడీకి నోటీసులు జారీ

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు గడువును ఇచ్చిన కోర్టు.. విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేసింది

Advertisement

India Summons US Diplomat: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన అమెరికా దౌత్యవేత్త, మీకు తగదంటూ నోటీసులు జారీ చేసిన భారత్

Hazarath Reddy

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో అరెస్టు అయిన సీఎం కేజ్రీవాల్‌పై అమెరికా చేసిన వ్యాఖ్య‌ల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిష‌న్ గ్లోరియా బెర్బెనాకు విదేశాంగ శాఖ ఇవాళ స‌మ‌న్లు(Diplomat Summoned) జారీ చేసింది.

Arvind Kejriwal Health Update: ఈడీ కస్టడీలో క్షీణించిన అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం, షుగర్ లెవల్స్ పడిపోయాయని వార్తలు

Hazarath Reddy

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్బంధంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. మూలాల ప్రకారం, కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా ఉన్నాయి. 46 కి పడిపోయాయి. వైద్యులు ఇది ప్రమాదకరమని భావిస్తారు.

Andhra Pradesh Elections 2024: రేణిగుంటలో జగన్ ఫోటోతో చీరలు, వాచీలు, రూ. 50 కోట్ల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని రేణిగింటలో YSRCP నేతకు చెందినదని ఆరోపిస్తున్నగోడౌన్‌పై పోల్ అధికారులు దాడి చేసి రూ. 50 కోట్ల విలువైన చీరలు, స్పీకర్‌లు, కుక్కర్లు,.. భారీ మొత్తంలో చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై జగన్ ఫోటో ముద్రించి ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార YSRCP ఉచితాలను పంపిణీ చేస్తోందని TDP ఆరోపించింది.

Delhi Liquor Scam Case: ఈడీ మా ఇంట్లో ఎన్నిసార్లు రైడ్ చేసినా చిల్లిగ‌వ్వ కూడా దొర‌క‌లేదు, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు, రేపు కోర్టులో డబ్బు గురించి చెబుతారని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప‌లుమార్లు ఈడీ త‌మ ఇండ్ల‌ల్లో రెయిడ్ చేసినా.. ఒక్క‌సారి కూడా చిల్లిగ‌వ్వ దొర‌క‌లేద‌ని ఆమె అన్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: రేపటి నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్న సీఎం జగన్, ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర

Hazarath Reddy

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రతో ప్రచార భేరి మోగించనున్నారు.

Andhra Pradesh Elections 2024: జనసేన ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు.

Delhi Excise Policy Case: కవిత కేసులో రాజకీయ ప్రమేయం లేదు, అది అంతా అవినీతి కేసు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్, తెలంగాణ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేసు రాజకీయ ప్రేరేపితమైనది కాదని, ఇది అవినీతి కేసు అని.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి సంబంధించిన కేసు అని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR Slams CM Revanth Reddy: వెంట్రుక కూడా పీకలేవంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతారంటూ జోస్యం

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు (KTR Slams CM Revanth Reddy) చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
Advertisement