Telangana 2018 honour killing: Court convicts 7 accused, awards death penalty to one (photo-File Image)

Hyd, Mar 10: తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం రేపిన పరువు హత్య కేసులు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) ప్రణయ్‌(24)ను అత్యంత దారుణంగా చంపిన (Telangana 2018 honour killing) సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.

దాదాపు ఆరేళ్లకు పైగా ప్రణయ్‌, అమృత కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్‌ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోర్టు తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

మారుతి రావు ఆత్మహత్య, అసలేం జరిగింది?, అమృత తండ్రి ఆత్మహత్యకు కారణమేంటి ?, ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా మారుతీరావు, కేసుల ఒత్తిడే కారణమంటున్న ఆయన భార్య

మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay) అనే యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు.

మారుతీ రావు- అమృత కథలో అంతిమంగా గెలిచింది ఎవరు? ఎవరి ప్రేమ నిజమైనది? అసలు దీన్ని ప్రేమే అంటారా? ఈ చావుకు కారణం కులామా లేక ప్రేమా? విశ్లేషాణాత్మక కథనం

ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్‌), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ఓనర్‌)గా ఉన్నారు.ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్‌ దక్కింది.అనంతరం ఆయన అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. తాజాగా కోర్టు తుది తీర్పును వెలువరించింది.

2018లో ప్రణయ్‌- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్‌ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.