వర్షాకాలం నుండి చలికాలం మారే సమయంలో అనేకమంది జలుబు జ్వరం దగ్గు అంటే సమస్యలతో బాధపడుతుంటారు సీజనల్ గా వచ్చే వ్యాధుల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కొన్నిసార్లు తరచుగా ఇన్ఫెక్షన్ అనేది మళ్లీమళ్లీ వస్తుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా జీవనశైలిలో మార్పు వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, పోషకాహార లోపం వల్ల కూడా ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. తరచుగా జలుబు దగ్గు జ్వరం సమస్యతో బాధపడేవారు. మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా చేర్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడతారు.

జబ్బులు రాకుండా ఉండాలి, అంటే మన శరీరానికి తగినంత ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి విటమిన్ సి ఉన్న పనులను ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు. నారింజ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష వంటి సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

బరువు తగ్గుతారు: విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడతారు. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అది మీ కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా దీన్ని తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీని ద్వారా మీరు అధిక బరువు నుండి బయటపడతారు.

Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..

రక్తాన్ని పెంచుతుంది: విటమిన్ సి రక్త వృద్ధికి కూడా తోడ్పడుతుంది విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను పండ్లను కూరగాయలను తీసుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సినంత రక్తం లభిస్తుంది. దీని ద్వారా అనేక జబ్బుల నుండి బయటపడతారు.

ఆందోళన తగ్గిస్తుంది: ఆందోళన నిరాశ వంటి సమస్యలతో బాధపడేవారు సిట్రస్ జాతికి చెందిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వీరి శరీరంలో కార్టీ సాల్ అనే ఎంజేయంలో తగ్గించి మనసుని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

షుగర్ ని తగ్గిస్తుంది: మధుమేహ సమస్యతో బాధపడేవారు మీరు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అటువంటివారు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మీ ఆహారంలో విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను చేసుకోవడం ఉత్తమం ద్వారా మీ చెక్కర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి అంతే కాకుండా తరచుగా వచ్చే జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ నుండి బయటపడతారు.