Viral

Boat Capsizes In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)

Rudra

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.

Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్

Rudra

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నది.

Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Hazarath Reddy

టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న వివిధ కంపెనీలు 2025లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది, ఎందుకంటే వారు తదుపరి ఉద్యోగాలు కోల్పోతారనే భయంతో ఉన్నారు.

Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్‌లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..

Hazarath Reddy

కేరళలోని కలంజూర్ గ్రామంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితుడిని వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేశాడు. నిందితుడిని 32 ఏళ్ల బైజుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై (Double Murder in Kerala) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

'Chhaava' Telugu Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఛావా తెలుగు ట్రైలర్, ఈ నెల‌ 7న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్‌ సఫారీలో గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్‌ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు.

Lady Aghori: వీడియో ఇదిగో, రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తానంటూ మళ్లీ లేడీ అఘోరీ తణుకులో హల్‌చల్, అక్కడి నుంచి అఘోరీని పంపించిన పోలీసులు

Hazarath Reddy

ఈ మధ్య కనపడకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రచ్చ రచ్చ చేసింది

Man Injured in Wild Boar Attack: వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన

Hazarath Reddy

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది.

Advertisement

Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతలపడిన బైక్ రైడర్లు, తీవ్ర గాయాలు

Hazarath Reddy

యూపీలోని రాయ్‌బరేలిలోని ఉంచహార్ కొత్వాలి ప్రాంతంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ రైడర్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్‌

Hazarath Reddy

బీహార్ జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అతిగా ప్రవర్తించారు. దివ్యాంగుడిని దారుణంగా కర్రలతో కొట్టారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు సస్పెండ్‌ అయ్యారు. బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలో మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తి రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చున్నాడు.

Telangana Shocker: వీడియో ఇదిగో, పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లి గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిన యువకుడు

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.

Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ ఘాట్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

Advertisement

2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

Rudra

యావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.

Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.

YouTuber Slaps Passenger: రీల్‌ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులను గాయపరుస్తారు. ఇదీ అలాంటి ఘటనే. వైరల్‌ రీల్‌ కోసం ఒక యూట్యూబర్‌ ప్రయత్నించాడు.

Advertisement

MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)

Rudra

ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.

Accident Caught on Camera: బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి

Hazarath Reddy

బనశంకరిలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు BMTC బస్సుల మధ్య ఆటోరిక్షా ఇరుక్కుపోయి డ్రైవర్, అందులోని ప్రయాణీకుడు మరణించిన దృశ్యం కెమెరాలో రికార్డైంది. గిరినగర్‌లోని సీతా సర్కిల్ సమీపంలో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Virat Kohli New Record: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. 36 ఏళ్ల కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ క్యాచ్ వీడియో ఇదిగో, ఎడమవైపుకు పక్షిలా దూకిన తీరుకు బిత్తరపోయిన రవీంద్ర జడేజా

Hazarath Reddy

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Advertisement
Advertisement