Viral

Cisco Layoffs: ఆగని లేఆప్స్, 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన సిస్కో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు

Vikas M

AI వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో వనరులను మరింత సమర్ధవంతంగా కేటాయించాలని కంపెనీ కోరుతున్నందున తొలగింపులు పునర్నిర్మాణ ప్రయత్నంగా చెప్పబడుతున్నాయి. Cisco నుండి అడుగు టెక్ పరిశ్రమలో AI మరియు సైబర్ భద్రత యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ తొలగింపులు దాదాపు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Texas Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టినా క్షేమంగా బయటపడ్డ ఇద్దరు పసిబిడ్డలు, టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Hazarath Reddy

మంగళవారం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్‌లోని ఇంటర్‌స్టేట్ 10 ఈస్ట్ ఫ్రీవే మధ్యలో చాలాసార్లు పల్టీలు కొట్టిన కారు నుండి బయటకు తీయబడిన తర్వాత ఇద్దరు పసిబిడ్డలు అందులో చిక్కుకుపోయారు.

Varalakshmi Vratam Messages in Telugu: వరలక్ష్మీ వ్రతం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పండిలా

Hazarath Reddy

ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

Varalakshmi Vratham Wishes in Telugu: వరలక్ష్మీ వ్రతం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.

Advertisement

Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.

Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..

Hazarath Reddy

కామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు

Viral Video: రెండుగా విడిపోయిన అహ్మదాబాద్ - ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌, గోతంగం యార్డ్ సమీపంలో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ బిన్‌ మోహ్‌సేన్‌ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్‌ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.

Advertisement

Gujarat: కుక్కల దెబ్బకు తోకముడిచిన సింహాలు,షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్, గుజరాత్‌లో ఓ ఊరిలోకి వచ్చిన రెండు సింహాలు, ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుక్కలు, వీడియో వైరల్

Arun Charagonda

గుజరాత్‌లోని ఆమ్రేలిలో రెండు సింహాలు హల్ చల్ చేశారు. రాత్రి సమయంలో ఓ గ్రామంలోకి రెండు సింహాలు వచ్చాయి. అయితే సింహాలను ఇంట్లోకి రాకుండా రెండు కుక్కలు తీవ్రంగా పోరాడాయి. దీంతో చేసేదేమి లేక సింహాలు వెనుదిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు

Robbery Attempt Caught on Camera: తుపాకీలతో చోరీకి వచ్చిన దొంగలను యజమాని ఎలా తరిమి కొట్టాడో వీడియోలో చూడండి

Hazarath Reddy

బుధవారం తెల్లవారుజామున థానేలోని కపూర్‌బావాడి ప్రాంతంలోని నగల దుకాణంలో జరిగిన దోపిడీ యత్నాన్ని యజమాని చెక్క కర్రతో ధైర్యంగా నలుగురు దుండగులను అడ్డుకోవడంతో విఫలమైంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో దుకాణంలోకి ప్రవేశించిన ముసుగు ధరించిన దుండగులు తుపాకులు పట్టుకుని, యజమానిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు.

Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి, బీహార్ లో వైర‌ల్ గా మారిన వీడియో

VNS

ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్‌ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral video) అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది

Advertisement

Suchitra Apologizes to Karthik Kumar: మాజీ భర్తని గే అన్నందుకు క్షమాపణలు చెప్పిన త‌మిళ సింగ‌ర్ సుచిత్ర‌, వీడియో ఇదిగో..

Vikas M

Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్‌ మాటల్లో..

Vikas M

గంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను.

Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్‌ సింగర్‌తో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు

Vikas M

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి.

Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌, రెండవ స్థానంలో రోహిత్‌ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్

Vikas M

టీమ్‌ఇండియా స్టార్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.

Advertisement

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా, గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌

Vikas M

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.

Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు

Hazarath Reddy

బిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్‌ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..

Vikas M

బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుద‌లైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్ర‌ధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.

Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Vikas M

బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement
Advertisement