Viral
Hackers Targeting Indian Govt: భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు, రహస్య పత్రాలను దొంగిలించడానికి సైబర్-గూఢచర్యం ప్రచారం
Hazarath Reddyరహస్య పత్రాలను దొంగిలించడానికి భారత ప్రభుత్వంలోని వివిధ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని హ్యాకర్స్ ఉపయోగిస్తున్న అత్యంత అధునాతన సైబర్-గూఢచర్య ప్రచారాన్ని -- 'ఆపరేషన్ రూస్టిక్‌వెబ్'ను పరిశోధకులు కనుగొన్నారని కొత్త నివేదిక బుధవారం తెలిపింది
Ram Temple Consecration: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలను వెంటనే ఆపండి, అలహాబాద్ హైకోర్టులో రెండు పిల్‌లు దాఖలు, అత్యవసర విచారణకు నిరాకరించిన ధర్మాసనం
Hazarath Reddyజనవరి 22న అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయ ప్రాన్‌ప్రతిష్ఠ వేడుకకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో రెండు పిల్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణను వేగవంతం చేసేందుకు కోర్టు నిరాకరించింది.
Sachin Deepfake Video Case: సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో కేసు, యాప్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyసచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో విచారణలో భాగంగా యాప్ యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. IPC సెక్షన్ 500, IT చట్టంలోని సెక్షన్ 56 కింద కేసు నమోదు చేశారు.
Mumbai Airport Fined Rs 60 Lakh: రన్ వేపై భోజనాలు వీడియో వైరల్, ముంబై విమానశ్రయానికి రూ. 60 లక్షలు జరిమానా విధించిన డిజిసిఎ
Hazarath Reddyముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రన్ వేపై ప్రయాణికులు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) బుధవారం ముంబై విమానాశ్రయానికి రూ.60 లక్షల జరిమానా విధించింది.
IndiGo Fined Rs 1.20 Crore: రన్ వేపై భోజనాలు వీడియో వైరల్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.1.20 కోట్ల జరిమానా విధించిన డిజిసిఎ
Hazarath Reddyముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి ఆహారం అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.1.20 కోట్ల జరిమానా చెల్లించాలని డిజిసిఎ ఆదేశాలు జారీ చేసింది
Rohit Sharma Century Video: వీడియో ఇదిగో, ఐదు సెంచరీలతో వరల్డ్ రికార్డ్‌ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఆప్ఘన్ బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyరోహిత్‌ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(1643 పరుగులు) అవతరించాడు
Most Centuries in T20Is: టీ20లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు, అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు
Hazarath Reddyఅఫ్గనిస్తాన్‌ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్‌ శర్మ పరుగుల దాహం తీరలేదు
Virat Kohli Golden Duck: టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్‌ డక్‌ అయిన విరాట్ కోహ్లీ, రన్ మిషన్ అవుట్‌ కాగానే నిశ్శబ్దంగా మారిపోయిన స్టేడియం
Hazarath Reddyఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత స్టార్ స్టార్ విరాట్ కోహ్లీ తన టీ20ఐ కెరీర్‌లో మొట్టమొదటి గోల్డెన్ డక్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం ఇది ఐదోసారి.
Mutant Coronavirus Strain: కొత్త కరోనావైరస్‌ను సృష్టిస్తున్న చైనా శాస్త్రవేత్తలు, ఈ వైరస్ సోకితే 8 రోజుల్లోనే మృతి, సంచలన నివేదికను ప్రచురించిన డైలీ మెయిల్
Hazarath Reddyచైనా శాస్త్రవేత్తలు కొత్త కరోనా వైరస్‌ను సృష్టిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చైనీస్ శాస్త్రవేత్తలు మ్యూటాంట్ కరోనావైరస్ స్ట్రెయిన్‌ను (Mutant Coronavirus Strain) సృష్టిస్తున్నారని ఇది ఎలుకలలో 100% కిల్ రేటును (It Has A 100% Kill Rate In Mice) కలిగి ఉందని సంచలన నివేదిక బయటకు వచ్చింది.
Train Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి
Hazarath Reddyనవీ ముంబయిలోని జుయినగర్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఆ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఈ సంఘటన డిసెంబర్ 25, 2023న జరిగింది. ఈ ఘటన తర్వాత రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఆందోళన చెలరేగింది. ఘటన జరిగిన వెంటనే స్టేషన్‌ అధికారి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.
Sankranti Celebrations: వీడియో ఇదిగో, అల్లుడికి 300 రకాల వంటలు వడ్డించిన అత్తింటివారు
Hazarath Reddyసోమవారం మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో సాయి గోపాల్ కుటుంబం వారి కొత్తగా పెళ్లయిన కూతురు రిషిత మరియు అల్లుడు దేవేంద్రకు 300 ఆహార పదార్థాలను వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Sankranti Celebrations: వీడియోలు ఇవిగో, కోడిపందాల బెట్టింగ్, ఎన్టీఆర్ జిల్లాలో రక్తమొచ్చేలా తన్నుకున్న ఇరు వర్గాలు, పోలీసులు రావడంతో పరార్..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాల బెట్టింగ్ సందర్భంగా గ్రూప్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన వారిని చెదరగొట్టారు
Ram Mandir Car Video: కారు రూపంలో రామ మందిరం వీడియో ఇదిగో, భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకంగా రూపొందించిన రామ మందిరం కారును చూసేయండి
Hazarath Reddyహైదరాబాద్ కు చెందిన వ్యక్తి శ్రీ రామమందిరాన్ని కారు రూపంలో తయారు చేశాడు. హైదరాబాద్‌లోని సుధాకార్స్ మ్యూజియంను కలిగి ఉన్న భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్, రోజువారీ వస్తువులను పోలి ఉండే ప్రత్యేకమైన 'వాకీ కార్ మ్యూజియం' ప్రదర్శనలు నిర్వహిస్తుంటాడు
Woman Dies of Cardiac Arrest: షాకింగ్ వీడియో ఇదిగో, భోగి వేడుకల్లో కోలాటం వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ, గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyతెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన రాజమణి (40) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kishan Reddy Cleaning Temple Video: వీడియో ఇదిగో, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చెత్తను ఊడ్చి చేతులతో ఎత్తేసిన కిషన్ రెడ్డి, స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేసిన కేంద్ర మంత్రి
Hazarath Reddyఅయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
Uttar Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టిన రైలు, అక్కడికక్కడే పెద్దాయన మృతి
Hazarath Reddyఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రాక్ దాటుతూ రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. యూపీ - కాన్పూర్‌లో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు.రైలు వస్తుందని తెలిసినా వేగంగా ట్రాక్ దాటాలనే ఆలోచనతో ముందకెళ్లగా అమితవేగంతో వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది.
SC on Hate Speech in Rallies: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీలో ద్వేషపూరిత ప్రసంగాలు జరగకుండా చూడండి, జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyహిందూ జనజాగృతి సమితి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టి రాజా సింగ్‌లు నిర్వహించే ర్యాలీలలో విద్వేషపూరిత ప్రసంగాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత, మహారాష్ట్రలోని యవత్మాల్ మరియు రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది.
GVL Rode Rickshaw Video: వీడియో ఇదిగో, విశాఖ వీధుల్లో రిక్షా తొక్కిన జీవీఎల్, రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించిన బీజేపీ ఎంపీ
Hazarath Reddyవిశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి రిక్షా తొక్కారు.తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించారు
Corbevax: భారత్‌లో తయారైన కార్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు, ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద టీకాను వాడుకోవచ్చని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyభారత్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) ఆవిష్కరించిన కొవిడ్‌ టీకా ‘కార్బెవ్యాక్స్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు (Emergency Use Listing) లభించింది. ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై మనదేశంలో తయారైన తొలి టీకా ఇది.
Iran Attacks Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు,డ్రోన్‌లతో ఇరాన్ దాడి, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అటాక్ చేసిన ఇరాన్
Hazarath Reddyపాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించింది