వైరల్

Road Accident: హైదరాబాద్ మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదేండ్ల కూతురు మృతి, తండ్రికి గాయాలు (వీడియో)

Rudra

హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రోడ్లు వెరసి రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

Case Against Kris Gopalakrishnan: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు.. మరో 17 మందిపై కూడా.. ఎందుకంటే??

Rudra

దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు.

PM Modi To Visit White House In February: వచ్చే నెలలో వైట్‌ హౌజ్‌ కు ప్రధాని మోదీ.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

Rudra

ప్ర‌ధాని నరేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో అంటే వచ్చే నెల మోదీ వైట్‌ హౌజ్‌ ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు.

4-Day Work Week Culture: వారానికి 4 రోజుల ప‌నే.. మా కంపెనీల్లో ఇంతే.. ఎలాంటి శాల‌రీ కటింగ్ కూడా వుండదు!.. బ్రిటన్‌ లోని 200 కంపెనీల సంచ‌ల‌న నిర్ణ‌యం

Rudra

ప‌ని గంట‌ల విష‌య‌మై భార‌త్‌ తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తున్న సమయంలో బ్రిటన్ లోని దాదాపు 200 కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

Advertisement

Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌

Rudra

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.

Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్‌ లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

Rudra

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

No Night Shows For Minors: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను సినిమా థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది.

Guillain-Barré Syndrome: నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.

Advertisement

Bihar: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే రోజున పుల్లుగా తాగి స్కూలు వచ్చిన హెడ్ మాస్టర్, మనుగడకు మద్యపానం అవసరమని సెటైర్, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ముజఫర్‌పూర్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం తాగి పాఠశాలకు చేరుకున్న హెడ్ మాస్టర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ షాకింగ్ సంఘటనలో, బీహార్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ మద్యం తాగి దొరికిపోయాడు.

Couple Romances on Bike: బైక్‌పై జంట రొమాన్స్ వీడియో ఇదిగో, ట్యాంకర్ మీద ప్రియురాలు కూర్చుంటే బైక్ నడుపుతూ ముద్దులు పెట్టిన ప్రియుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ జంట హైస్పీడ్ బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ట్రాఫిక్ భద్రత, ప్రజల గౌరవ మర్యాదలపై ఆందోళనలు రేకెత్తించింది. జనవరి 27న వెలువడిన ఫుటేజీలో, ఆ మహిళ బైక్ ట్యాంక్‌పై కూర్చొని ప్రియుడుతో ముద్దుల్లో మునిగితేలింది.

Pune: వీడియో ఇదిగో, 100 ఉద్యోగాల వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వేల సంఖ్యలో బారులు తీరిన ఇంజనీర్లు, పుణెలోని ఐటీ కంపెనీ వెలుపల ఘటన

Hazarath Reddy

పుణెలోని మగర్‌పట్టాలోని ఒక ఐటీ కంపెనీ వెలుపల 3,000 మంది ఇంజనీర్లు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వరుసలో నిల్చున్నట్లు ఒక వైరల్ వీడియో ప్రదర్శించింది, ఇది భారతదేశ ఉద్యోగ మార్కెట్ యొక్క పోటీ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కేవలం 100 జూనియర్ డెవలపర్ స్థానాలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో సాలిడ్ అప్‌డేట్, బాబీ డియోల్ పుట్టిన‌రోజు సందర్భంగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

Hazarath Reddy

పవన్ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'. ప్ర‌స్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం ప‌వ‌న్‌ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్‌ ఇప్ప‌టికే ప్రకటించారు

Advertisement

Hyderabad Man Dies By Suicide: లారీ కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం బయటకు.. మేడ్చల్ లో ఘటన (వీడియో)

Rudra

ఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు.

Mary Kom: వీడియో ఇదిగో, నదిలోనే బాక్స్ంగ్ పంచ్‌లను ప్రదర్శించిన మేరి కోమ్, త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానం ఆచరించిన ఒలింపిక్ పతక విజేత

Hazarath Reddy

బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. తన పర్యటనలో, ఆమె మొదటిసారిగా ఈ కార్యక్రమానికి హాజరైన అనుభవాన్ని పంచుకుంది. మేళా మైదానం యొక్క ఏర్పాట్లు, సమర్థ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది.

Mumbai: వీడియో ఇదిగో, పదమూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కిందపడిన చిన్నారి, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడిన బాలుడు, ఎలాగో తెలుసా..

Hazarath Reddy

మహారాష్ట్రలో జరిగిన షాకింగ్ సంఘటనలో, థానేలోని ఎత్తైన సొసైటీలో రెండేళ్ల బాలుడు పడమూడు అంతస్తుల బిల్డింగ్ లో మూడవ ఫ్లోర్ నుండి పడిపోయినా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kerala: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్

Hazarath Reddy

తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది

Advertisement

Heart Attack: గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?

Rudra

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.

Honor Killing: సూర్యాపేటలో పరువు హత్య! ప్రేమించాడన్న నెపంతో దారుణంగా చంపి నదిలో విసిరేసి.. (వీడియో)

Rudra

సూర్యాపేటలో పరువు హత్య కలకలం సృష్టించింది. వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Foreign Ganja: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్.. సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా గంజాయి సరఫరా!

Rudra

హైదరాబాద్‌ నగరంలో మరోసారి విదేశీ గంజాయి కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

First Time, National Flag Was Unfurled: 75 ఏండ్లలో ఆ ఊళ్లో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు.. తొలిసారిగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి ఛత్తీస్‌ గఢ్‌ లో గ్రామస్థుల సంబురం (వీడియో)

Rudra

దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.

Advertisement
Advertisement