Viral

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

Rudra

మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.

Donald Trump Dance Video: డొనాల్డ్‌ ట్రంప్‌ డ్యాన్స్ వీడియో ఇదిగో, ఐకానిక్‌ స్టెప్పులతో అదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు, 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్‌ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లో ఆదివారం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్‌ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TikTok Back in US: అమెరికాలో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌, నిషేధించిన 24 గంటల్లోనే తమ సేవలను పునరుద్ధరించిన బైట్‌డ్యాన్స్‌

Hazarath Reddy

చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్

Bhairavam Teaser Out: రాత్రి నాకో కల వచ్చింది, చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు అంటూ భైరవం టీజర్ విడుదల, హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టిన యంగ్ హీరోలు

Hazarath Reddy

టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుద‌ల‌ చేశారు. ఈ టీజ‌ర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టారు.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, హిందూ మహిళను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం, హిందూ మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును కూడా మార్చుకున్న యువకుడు

Hazarath Reddy

యూపీలోని బస్తీ జిల్లాలో పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి ఏకంగా తన మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు

Kerala: వీడియో ఇదిగో, ఏనుగు దాడి నుంచి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్న కుటుంబం, అప్పప్పర సమీపంలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

కేరళలోని వయనాడ్ జిల్లాలోని తిరునెల్లికి సమీపంలో ఉన్న అప్పప్పర సమీపంలో ముగ్గురు సభ్యుల కుటుంబం అడవి ఏనుగు నుండి తృటిలో తప్పించుకుంది. ఆ కుటుంబం బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఒక మలుపు వద్ద అకస్మాత్తుగా ఒక ఏనుగును ఎదురైంది.

Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ, 17 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అర్థరాత్రి జరిగిన షాకింగ్ సంఘటనలో, బులంద్‌షహర్‌లోని దిబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-509లో మహాదేవ్ చౌరాహా వద్ద స్లీపర్ కోచ్ బస్సును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. కారును ఢీకొట్టకుండా ఉండేందుకు లారీ అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Uttar Pradesh: వీడియో ఇదిగో, శభాష్ జవాన్, కదులుతున్న రైలు కింద పడిపోతున్న వృద్ధుడిని కాపాడిన సైనికుడు, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ జవాన్ చేసిన వీరోచిత చర్య సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది. కదులుతున్న రైలు నుంచి కింద పడిపోకుండా 70 ఏళ్ల వ్యక్తిని రక్షించడంతో అతను వార్తల్లోకెక్కాడు. ఓ వృద్ధుడు ప్లాట్‌ఫారమ్‌పైకి దిగడానికి ప్రయత్నించి, కాలు తప్పి రైలుకు దగ్గరగా జారిపోయాడు.

Advertisement

Vinod Kambli Birthday: వీడియో ఇదిగో, వినోద్ కాంబ్లీ పుట్టినరోజు వేడుకలు, థానే ఆసుపత్రిలో సిబ్బంది, కుటుంబ సభ్యులతో జరుపుకున్న టీమిండియా మాజీ క్రికెటర్

Hazarath Reddy

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన పుట్టినరోజును థానే జిల్లాలోని భివాండిలోని ఓ ఆసుపత్రిలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఒక వైరల్ వీడియోలో కాంబ్లీ ఉద్వేగభరితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందికి మరియు అతని అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూపబడింది.

Himachal Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పారాగ్లైడింగ్ చేస్తూ పట్టుజారి పడిపోయిన యువతి, లోయలో పడి మృతి, పారాగ్లైడింగ్ పైలట్‌కు గాయాలు

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ సోర్టీ తప్పుగా జరగడంతో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మరణించగా, 29 ఏళ్ల పారాగ్లైడింగ్ పైలట్ గాయపడ్డాడు. అహ్మదాబాద్‌కు చెందిన చెందిన భావసర్ ఖుషీ తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వచ్చింది.

Bengaluru Police: వీడియో ఇదిగో, హారన్ కొట్టిన డ్రైవర్‌కు దిమ్మతిరిగే పనిష్మెంట్‌ ఇచ్చిన పోలీసులు, తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో బిత్తరపోయిన డ్రైవర్

Hazarath Reddy

రోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు అవసరం లేకపోయినా హారన్ పెద్దగా మోగిస్తూ వాహనదారులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి బెంగుళూరు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ

Hazarath Reddy

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.

Advertisement

Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.

UP Horror: పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)

Rudra

ఉత్తర్ ప్రదేశ్‌ లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం తీసుకురమ్మని కోరగా.. జ్యూస్‌ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్‌ ను కలిపింది ఆమె.

Donald Trump Sand Art: ట్రంప్‌ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రమాణం నేపథ్యంలో ట్రంప్‌ సైకత శిల్పం

Rudra

నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.

Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)

Rudra

తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!

Rudra

విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌ లో రెండు పతకాలు సాధించి భారత్‌ ‌కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది.

Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం.. తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు

Rudra

నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.

Rajasthan Shocker: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్‌ రూమ్‌ లో రాసలీలలు.. (వీడియోతో)

Rudra

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ గఢ్‌ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.

Bigg Boss 18 Grand Finale: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్

Rudra

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ అందజేశారు.

Advertisement
Advertisement