వైరల్
IPL 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్, 17 డకౌట్లతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌
Hazarath Reddyఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా దినేశ్‌ కార్తిక్‌ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్‌ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్‌, సునీల్‌ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
IPL 2023: శుభమాన్ గిల్ సిక్స్ వీడియో, స్టేడియంలోనే నేల మీద పడుకుని ఏడ్చేసిన మహమ్మద్ సిరాజ్, డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టిన కోహ్లీ
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించగా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
IPL 2023: విరాట్ కోహ్లీని మళ్లీ గెలికిన నవీన్‌ ఉల్‌ హక్‌, ఎగతాళి చేస్తూ వీడియో పోస్ట్, నీవు అస్సలు మనిషివేనా అంటూ మండిపడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్ రేసులో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది.దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్‌ లీగ్‌ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్‌ ఉల్‌ హక్‌ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ స్టోరీ పోస్టు చేశాడు.
Wayne Parnell Stunning Catch Video: అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన పార్నెల్, ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు.
IPL 2023 Playoffs Schedule: ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదిగో, మే 23న గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
Hazarath ReddyIPL 2023 యొక్క లీగ్ దశ చివరి రోజు చాలా నాటకీయతను చూసింది, ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఫైనల్ ప్లేఆఫ్ బెర్త్‌ను కైవసం చేసుకోగలిగింది
Virat Kohli Tears Video: ఐపీఎల్ రేసు నుంచి బెంగుళూరు ఔట్, స్టేడియంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..
Hazarath Reddyవిరాట్‌ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Adidas as Team India's New Kit Sponsor: టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌, ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం
Hazarath Reddyటీమ్‌ఇండియా (Team India) కిట్‌ స్పాన్సర్‌గా (Kit Sponsor) ఇకపై అడిడాస్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.
UN Warns on Cholera Surge: ప్రపంచం నెత్తిన మరో మహమ్మారి పిడుగు, రాబోయే రోజుల్లో 100 కోట్ల మంది కలరా వ్యాధి కోరల్లో చిక్కుకుంటారని యుఎన్ హెచ్చరిక
Hazarath Reddyకరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచంపై మరో పిడుగులాంటి వార్త పడింది. ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
Rs 2000 Notes Deposit in Bank: రూ.2000 నోట్లు రూ. 50 వేల పైన డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తప్పని సరి, ఈ మొత్తానికి ఆదాయపు పన్నువర్తిస్తుందని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Hazarath Reddyబ్యాంకు ఖాతాల్లో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు ప్రస్తుత ఆదాయపు పన్ను ఆవశ్యకత రూ.2,000 నోట్లపై కూడా వర్తిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2000 నోట్లలో రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అవసరమని ఆయన అన్నారు.
RBI Governor on Rs 2,000 Note: ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధన రూ. 2,000 నోట్లకు కూడా వర్తిస్తుంది, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నాడు రూ. 2,000 నోట్లను, అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం సెంట్రల్ బ్యాంక్ యొక్క కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో ఒక భాగమని తెలిపింది.
Salaar Movie Update: సలార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్, 400 మంది ఫైటర్లతో ప్రభాస్ క్లైమాక్స్‌ ఎపిసోడ్, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి సలార్
Hazarath Reddyరెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న స్టార్ మూవీ సలార్. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు.
PM Modi Conferred Highest Honour Of Fiji: ప్రధాని మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం, ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రదానం చేసిన ఫిజీ ప్రధాని సితివేణి
Hazarath Reddyఫిజీ ప్రధాని సితివేణి రబుకా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫిజీ యొక్క అత్యున్నత గౌరవం "కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ" అని పిఎం మోడీకి ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారని చెప్పబడింది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులది అని ప్రధాని మోదీ అన్నారు
Rs 2000 Note Exchange: రేపటి నుంచి ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు, బ్యాంక్ కౌంటర్లలో ఇంతకు ముందు లాగే సేవలు అందించనున్న బ్యాంకులు
Hazarath Reddyబ్యాంక్ కౌంటర్‌లో రూ. 2000 నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించబడుతుంది, అంటే ఇంతకుముందు అందించిన విధంగానే ఈ సేవలు అందిచడం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తెలిపింది. రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవడానికి రేపు, మే 23 నుండి ఏ బ్యాంక్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.
Kerala High Court: సోదరుడి వల్ల గర్భవతి అయిన 15 ఏండ్ల బాలిక.. 7 నెలల గర్భం విచ్చిత్తికి కేరళ హైకోర్టు అంగీకారం
Rudraసోదరుడి వల్ల ఓ 15 ఏండ్ల బాలిక గర్భవతిగా మారింది. ప్రస్తుతం 7 నెలల గర్భిణి. దీంతో తన గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తిని కేరళ హైకోర్టు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పుచెప్పింది. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
Viral Video: నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ మూగజీవికి నరకం చూపించి చంపిన యువకుడు.. మధ్యప్రదేశ్ లో హృదయవిదారక ఘటన.. వీడియో ఇదిగో..
Rudraజాతీయ పక్షి నెమలి ఈకలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడో యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. తాను చేసిన ఘనకార్యాన్ని వీడియో తీశాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో వెలుగు చూసింది.
Shubman Gill Abused: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
Rudraఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలోకి అడుగుపెట్టాలని ఆశపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభ్ మాన్ గిల్ అడ్డుతగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించగా, ఆర్సీబీ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఓటమిని జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్ గిల్ పై నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు.
Myanmar Earthquake: మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదు
Rudraమయన్మార్ లో ఈ ఉదయం 8.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.5గా గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
G20 At Srinagar: నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు.. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు
Rudraజమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది.
Satyapal Malik Lashes Out At Centre: కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య.. ఇంకా ఏమన్నారంటే??
Rudraజమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Rains In Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వీడియోతో
Rudraఎండలతో సతమతం అవుతున్న హైదరాబాదీలకు వరుణుడు కాస్త సాంత్వన కలిగించాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌తో పాటూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, శాంలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.