Viral

Jharkhand Shocker: రెండో ప్రియురాలి కోసం మొదటి ప్రియురాలిని కిరాతకంగా పొడిచి చంపేసిన యువకుడు..

kanha

మంజు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో పశుపతి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అంగడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో పారేయగా, పోలీసులు అక్కడి నుండి స్వాధీనం చేసుకున్నారు.

Bengal Tigress Gives Birth to Cubs: 18 ఏళ్ల తర్వాత 5 పులి పిల్లలకు జన్మనిచ్చిన రాయల్ బెంగాల్ టైగర్, పుట్టగానే మూడు పిల్లలు మృతి, రెండు సీసీటీవీ కెమెరాల నిఘాలో..

Hazarath Reddy

18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ పులి పిల్లలకు జన్మనిచ్చింది . సిద్ధి అని పిలువబడే రాయల్ బెంగాల్ టైగ్రెస్ మే 4న ఐదు పిల్లలను ప్రసవించింది -- రెండు సజీవంగా, మూడు చనిపోయిన పిల్లలకు జన్మనిచ్చింది.

Andhra Pradesh: ఫ్రెండ్ పుట్టిన రోజుకు తెల్ల చొక్కా ఇవ్వలేదని సవతి తల్లిపై బాలుడు ఫిర్యాదు, అర్థనగ్నంగా రోడ్డు మీద నడుచుకుంటూ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు

Hazarath Reddy

తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి ధరించడానికి తెల్ల చొక్కా ఇవ్వనందుకు సవతి తల్లిపై ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మైనర్ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Bungee Jumping Goes wrong: యువతి బంగీ జంప్‌, గాల్లో ఉండగా ఒక్కసారిగా తెగిన తాడు, భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

యువతి బంగీ జంప్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి బంగీ జంప్ కోసం రెడీ అయింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు

Advertisement

Karnataka: మైసూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో రహదారి అపవిత్రం, గో మూత్రం,పేడతో ఆ మార్గాన్ని శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ముగ్గురిపై కేసు నమోదు

Hazarath Reddy

ప్రధాని మోదీ (PM Modi) రోడ్‌ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్‌ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్‌ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్‌ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, పెంచుకుంటున్న పైథాన్‌తో ప్రజలపై దాడి, పోలీసులు రావడంతో పామును వదిలి సరెండర్

Hazarath Reddy

టోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్య‌క్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఓ వ్య‌క్తిపై దాంతో దాడి చేసేందుకు య‌త్నించ‌గా, ప్ర‌తిఘ‌టించాడు. అంత‌లోపే స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.

Kenya Cult Deaths: ఏసు ప్రభువు దగ్గరకు వెళ్లాలంటే మీరంతా ఆకలితో చచ్చిపోవాలి, పాస్టర్ మాయమాటలు నమ్మి 201 మంది మృతి, చిన్న పిల్లలు కొన ఊపిరితో ఉండగానే ఖననం

Hazarath Reddy

కెన్యాలో పాస్టర్ మాటలు నమ్మి కడుపు మాడ్చుకుని ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 201కు చేరుకుంది. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడేశాయి. ఈ దారుణ ఘటనకు పాల్పడిన పాస్టర్‌ పాల్‌ మెకంజీ, అతని భార్యతో పాటు ఇప్పటి వరకు 26 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Weather Forecast: తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, స్కూటీపై వెళుతూ స్నానం చేసిన లవర్స్, ఇదేం పాడు పని అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు

Hazarath Reddy

ప్రస్తుతం ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి వేగంగా వెళ్తున్న స్కూటీపై నీళ్లు పోసుకుంటూ కనిపించింది. అంతేకాదు స్కూటీ నడుపుతున్న యువకులపై నీళ్లు పోస్తూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Air Hostess Molested in Plane: విమానంలో పుల్లుగా మద్యం తాగి ఎయిర్ హోస్టెస్‌ని రేప్ చేయబోయిన మందుబాబు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

దుబాయ్ నుంచి అమృ‌త్‌సర్‌ వచ్చిన విమానంలో ఓ మందుబాబు పూటుగా మద్యం సేవించి, విమానంలోని ఎయిర్ హోస్టెస్‌ను వేధించినట్లు కేసు నమోదైంది. ఈ విమానం అమృ‌త్‌సర్‌లో దిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజిందర్ సింగ్ గా గుర్తించారు. రాజిందర్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్, కోట్లి గ్రామస్థుడని వెల్లడైంది. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

West Bengal: అంబులెన్స్‌కు డబ్బులు లేక కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని 200 కిమీ బస్సులో ప్రయాణించిన ఓ తండ్రి, పశ్చిమ బెంగాల్‌లో హృదయవిదారక ఘటన

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లో అంబులెన్సుకు చెల్లించేందుకు డబ్బులు లేక (Unable to Pay for Ambulance Services) ఓ వ్యక్తి తన కుమారుడి శవంతో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఉత్తర్‌ దినాజ్‌పూర్ జిల్లా కలియగంజ్‌ ప్రాంతం డంగిపారా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు ఆసిం దేవశర్మ. ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు.

UP Horror: కీచక టీచర్ అకృత్యం.. 15 మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి.. ముగ్గురి అరెస్ట్.. యూపీలో దారుణ ఘటన వెలుగులోకి

Rudra

యూపీలో ఘోరం చోటు చేసుకున్నది. షాజహాన్ పూర్ జిల్లాలోని తిల్ హార్ తాలూకాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినులపై గతకొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇలా 15 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Advertisement

Porn in Classroom! స్కూల్‌లో పోర్న్ పాఠాలు, రివేంజ్ సెక్స్ గురించి అవగాహన కల్పించడానికి బూతు పదాలు వాడిన Oregon School అధ్యాపకులు, తీవ్ర విమర్శలు

Hazarath Reddy

ఒరెగాన్‌లోని పదో తరగతి పిల్లలు ఇంటర్‌నెట్ పోర్నోగ్రఫీపై హెల్త్ క్లాస్‌లో అసభ్యకరమైన పదజాలానికి గురికావడంతో, సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఒక నివేదిక పేర్కొంది.గత వారం 'ఒరెగాన్ మామ్స్ యూనియన్' అనే Facebook సమూహంలో అనేక లైంగిక అసభ్య పదజాలంతో అనేక స్లయిడ్‌లు పోస్ట్ చేశారు.

Cyclone Mocha: మోచా తుపానుతో బంగ్లాదేశ్,మయన్మార్‌ దేశాలు విలవిల, గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని తెలిపిన అధికారులు

Hazarath Reddy

మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి. సెంట్‌ మార్టిన్‌ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి.

Tamilnadu Hooch Tragedy: కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం

Rudra

తమిళనాడులో ఘోరం జరిగింది. విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వారు.

Earthquake in Japan: జపాన్‌లో 5.9 తీవ్రతతో వరుస భూకంపాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని జేఎంఏ హెచ్చరిక

Hazarath Reddy

కోజుషిమాతో సహా జపాన్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపాలు సంభవించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఆదివారం జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంప తీవ్రత 7 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్న జపాన్ భూకంప తీవ్రత స్కేల్‌పై 3ని కొలుస్తుంది, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:12 గంటలకు (0812 GMT) 10 కి.మీ లోతులో సంభవించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది

Advertisement

Salaar Movie Latest Update: సలార్‌ మళ్లీ వాయిదా పడిందా? దీనిపై చిత్రబృందం ఏం చెప్పింది?

Rudra

కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న చిత్రం సలార్‌ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఆలస్యం కావడంతో రిలీజ్‌ వాయిదా పడనుందంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి.

Viral Video: స్టేడియంలోనే ఉన్నా.. ఫోన్ లో మ్యాచ్ చూస్తున్నాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మీరూ చూడండి.

Rudra

స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను వదిలేసి ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న సీట్లను వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూస్తూ కనిపించాడు. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.

Heat Waves In AP: పెనంలా మారిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు.. ఎండలకు తోడైన వడగాల్పులు.. నేడు, రేపు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో మండే ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎర్రటి ఎండలకు వడగాలులు తోడవడంతో నిన్న కోస్తాంధ్ర కుతకుత ఉడికిపోయింది. ఎండలకు తట్టుకోలేని జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

ICC to Remove 'Soft Signal' Forever: క్రికెట్ నుంచి ‘సాఫ్ట్ సిగ్నల్’ను శాశ్వతంగా తొలగించనున్న ఐసీసీ.. ఎప్పటి నుంచి అంటే??

Rudra

క్రికెట్ లో అంపైర్లు కీలక నిర్ణయాలను వెల్లడించడంలో ప్రముఖ పాత్ర పోషించే ‘సాఫ్ట్ సిగ్నల్’ను ఐసీసీ శాశ్వతంగా తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు క్రిక్ బజ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది.

Advertisement
Advertisement