Viral
IPL 2025 Mega Auction: మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్, వదిలించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyసౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సందర్భంగా భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు 12.25 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. గతంలో మహ్మద్ సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడారు.
IPL 2025 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పోటీలో నిలిచి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
Hazarath Reddyఇంగ్లండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ IPL 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB గట్టిపోటీని ఎదుర్కుంది. అయితే అంతిమంగా RCB INR 8.75 కోట్లకు డీల్‌ను దక్కించుకుంది.
Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం
Hazarath Reddyతెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది.
Telangana: వీడియో ఇదిగో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు, ఇంటికి వచ్చి EMI కట్టాలని యువకున్ని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు
Hazarath Reddyమెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు.
Viral Video: దాడి చేస్తున్నా వదలకుండా ఉడుమును ఈ మహిళ చేతితో ఎలా పట్టుకుందో వీడియోలో చూడండి, బాబోయ్ ఇంత ధైర్యమా అంటున్న నెటిజన్లు
Hazarath Reddyఓ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఉడుము గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌లో ఉన్న జంతువును కర్ర సహాయంతో పైకి లాగి చేతులతోనే పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Young Man Dies by Suicide in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య, చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని సూసైడ్
Hazarath Reddyఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రేణిగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించారు.
Andhra Pradesh: నిమ్మకాయలు పట్టుకుని మీసాలు, గడ్డంతో అఘోరీ హల్‌చల్, కర్నూలు జిల్లాలో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకర్నూలు జిల్లాలో మరోసారి అఘోరీ హల్చల్ చేశారు. గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ కోఠే (వీడియో)
Rudraఅసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.
Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్.. డిసెంబరు 8 నుంచి హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
Rudraఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
Accident in Shadnagar: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘటన (వీడియో)
Rudraరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు రివర్స్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
No Number Plate: వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్
Rudraనంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ హెచ్చరించారు.
Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Rudraనాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.
Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు
Rudraపెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Student Suicide: హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజయవాడ
Rudraహైదరాబాద్ లోని మియాపూర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్ కేసర్ లో మరో స్కాం.. ఏంటది??
Rudraహైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.
Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత
Rudraఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.
Puneet Superstar Slapped: వీడియో ఇదిగో, 'బిగ్ బాస్' ఫేమ్ పునీత్ సూపర్ స్టార్‌ను చితకబాదిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకా
Hazarath ReddyIndia's Got Latent, బిగ్ బాస్ OTT 2 లో కనిపించినందుకు పేరుగాంచిన సెన్సేషనల్ పునీత్ సూపర్ స్టార్ , ఇటీవల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకాతో బహిరంగ వాగ్వాదాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది, ఢాకా పునీత్‌ను ఎదుర్కొన్నట్లు, తరువాత అతనిని చెంపదెబ్బ కొట్టినట్లు వీడియో చూపిస్తుంది.
Rajasthan: అంత్యక్రియల సమయంలో చితిమంటల మీద నుంచి లేచిన యువకుడు చికిత్స పొందుతూ మృతి, నలుగురి వైద్యులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyరాజస్థాన్‌లో గురువారం అంత్యక్రియల చితిపై నుంచి లేచిన వ్యక్తి జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మార్చురీకి, ఆపై శ్మశాన వాటికకు పంపిన ముగ్గురు వైద్యులను జిల్లా కలెక్టర్ గురువారం రాత్రి సస్పెండ్ చేశారు.
Indore Road Accident Video: షాకింగ్ వీడియో, కారు బ్రేకులకు బదులు యాక్సిలరేటర్‌ను తొక్కిన వైద్యుడు, ముందున్న కారును ఢీకొట్టడంతో మృతి
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బ్రేకులకు బదులు యాక్సిలరేటర్‌ను తొక్కిన ఓ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.