విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు తెలిపారు.
ఇది అసలైన పండుగ సినిమా అని కితాబిచ్చారు. వెంకటేశ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారు. వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తుంటే సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. ఐశ్యర్య రాజేశ్, మీనాక్షి చౌదరిల నటన సూపర్బ్ అని చెప్పారు. బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతంగా ఉందని అన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
Mahesh Babu Tweet on Sankratiki Vastunnam Movie:
Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌
So proud and happy for my director @AnilRavipudi
for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters.
The kid "Bulli…
— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)