స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie) ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు. తాజా ట్రైలర్ లో 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్‌ కి సర్‌..' అనే డైలాగ్‌ ఎస్‌జే సూర్యతో చెప్పే డైలాగ్‌ మెగా ‍ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్‌ మార్క్ కనిపిస్తోంది.కాగా గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీలో బాలీవుడ్ భామ కియారా ‍‍అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

Game Changer Trailer Out

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)