జ్యోతిష శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద విజయం ఆనందానికి కారణంగా ఈ బుధ గ్రహం ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలకు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న బుధువ గ్రహం దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకూలం.
మీన రాశి- మీన రాశి వారికి బుధ గ్రహం దిశమార్పు కారణంగా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయపరంగా ఒక మెట్టు పెరుగుతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఏర్పడుతుంది. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇచ్చే సూచనలు ఉన్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణలో అవుతారు. ఈ రాశి వారు బుధవారం రోజు ఆకుపచ్చని బట్టలు ధరించి వినాయకుని పూజించడం ద్వారా అన్ని శుభాలు జరుగుతాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
సింహరాశి- సింహ రాశి వారికి బుధ గ్రహం దిశమార్పు కారణంగా అన్ని సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి, వృత్తి వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్లో ప్రమోషన్ కి అవకాశాలు ఉన్నాయి .కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడి కోసం గతంలో చేసిన ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి. కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ప్రతిరోజు గణేశుడిని పూజించి గణేశుడికి దురువాను అందించడం ద్వారా అనేక శుభ ఫలితాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి జనవరి 9 నుంచి చాలా అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. బుధుడు దక్షిణ దిశలో ప్రవేశించడం వల్ల వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు ఆందోళనను తగ్గిస్తుంది. అసలు పూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులు విజయవంతంగా అవుతాయి. కెరీర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. కార్యాలయాల్లో మీరు పని చేసే చోట గౌరవం పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.