Newdelhi, Jan 4: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) (Rajagopala Chidambaram) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై లోని ఓ ఆస్పత్రిలో (Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబరం మృతి పట్ల శాస్త్రవేత్తలతో పాటు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..
Veteran nuclear scientist Rajagopala Chidambaram passes away at 88
Read more at: https://t.co/tFNjwlNx4g #rajagopalachidambaram #RIP #NuclearScientist
— Mathrubhumi English (@mathrubhumieng) January 4, 2025
పద్మ పురస్కారాలు
అణు శాస్త్రవేత్తగా చిదంబరం తన కెరీర్ ప్రారంభించారు. పొఖ్రాన్-1(1975), పొఖ్రాన్-2(1998) అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలకపాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్ కు చైర్మన్ గా సేవలందించారు. రాజగోపాల్ కు 1999లో పద్మవిభూషణ్, 1975లో పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పని చేశారు.