కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒకేసారి ఏడు పాఠశాలకు ఈ మెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులు ( bomb threats on mail) వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు (Schools in Bengaluru receive bomb threats) హుటాహుటినా చేరుకొని పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. స్కూళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేశారు.

అయితే ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఇవి నకిలీ బెదిరింపులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పంత్‌ పేర్కొన్నారు. మహదేవపురలోని ఒపలన్ ఇంటర్నేషనల్ స్కూల్, వర్తుర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హెన్నూర్‌లోని న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, గోవింద్‌పురాలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని చెప్పారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)