ఇండోనేషియాలో అవిభ‌క్త క‌వ‌ల‌లు(Conjoined Twins) జ‌న్మించారు. ఆ ఇద్ద‌రికీ నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒక జ‌న‌నాంగం ఉన్న‌ది. 20 ల‌క్ష‌ల మందిలో ఒక‌రు ఇలా పుడుతార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగ‌స్ ట్రిప‌స్ అని పిలుస్తారు. ఇలా పుట్ట‌డాన్ని స్పైడ‌ర్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. ఈ క‌వ‌ల‌ల గురించి తాజాగా అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్ర‌చురించారు.ఈ పిల్ల‌లు 2018లోనే జ‌న్మించగా..ఇటీవ‌ల రిలీజైన జ‌ర్న‌ల్‌లో వారి గురించి రాశారు.  గొంతులో ఇరుకున్న మటన్ బొక్కను విజయవంతంగా తొలగించిన వైద్యులు

ఈ కేసులో సాధారణంగా ఒక పిల్లాడు చనిపోతాడని అయితే ఈ సోద‌రులు ఇద్ద‌రూ బ్ర‌తికే ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. మొద‌టి మూడు ఏళ్లు వాళ్లు ఫ్లాట్‌గా కింద‌నే నిద్ర‌పోయేవారు. బాడీ స్ట్ర‌క్చ‌ర్ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల వాళ్లు కూర్చునేవాళ్లు కాదు. అయితే ఓ స‌ర్జ‌రీ ద్వారా మూడ‌వ కాలును తీసివేశారు. దాంతో వాళ్ల తొడ‌లు, కాళ్ల‌కు బ‌లం వ‌చ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగ‌లుగుతున్నారు. కాలు స‌ర్జ‌రీ జ‌రిగిన మూడు నెల‌ల త‌ర్వాత కూడా వాళ్లు ఎటువంటి ఫిర్యాదులు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఇంకా ఆ క‌వ‌ల‌లు క‌లిసే ఉన్నారు. వాళ్ల‌ను వేరు చేసేందుకు ఏదైనా స‌ర్జ‌రీ చేస్తారా లేదా అన్న విష‌యాన్ని ఇంకా డాక్ట‌ర్లు నిర్ధారించ‌లేదు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)