Newdelhi, May 19: ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్టు పిరమిడ్ల (Egypt Pyramids) నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ ఎట్టకేలకు వీడినట్టే కనిపిస్తున్నది. పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన వందల టన్నుల బరువున్న భారీ బండరాళ్లను అక్కడికి ఎలా తరలించారన్న విషయం ఎవరికీ అంతుబట్టలేదు. అయితే, భూమిలో పూడుకుపోయిన 64 కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్’ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు తాజాగా గుర్తించారు. వేల ఏండ్ల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ 31 పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన వందల టన్నుల బరువున్న భారీ బండరాళ్లను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని, ఈ క్రమంలోనే వాటి నిర్మాణం సాధ్యమైనట్టు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ అధ్యయనం తేల్చింది.
🚨🇪🇬 🇺🇸 MYSTERY OF EGYPT'S PYRAMIDS SOLVED?
Scientists from UNC Wilmington discovered an ancient, long-lost branch of the River Nile, buried under desert and farmland, used to build 31 pyramids, including the Giza complex.
This waterway, the Ahramat branch, enabled the… pic.twitter.com/ELui1LQfB0
— Mario Nawfal (@MarioNawfal) May 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)