
Vijayawada, May 18: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల(SPs) ను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి(Gautami Shali ) , తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్(Harshavardhan) , పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ (Malika Garg) ను నియమించారు. అదే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ (Palnadu Collector )గా శ్రీకేష్ బాలాజీ (Srikesh Balaji ) ని నియమించారు.
అమరావతి: పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు కొత్త SPలను నియమించిన ఈసీ - పల్నాడుకు మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్దన్, అనంతపురానికి గౌతమి శాలి నియామకం #Palnadu #Guntur #Tirupati #ECI #SP pic.twitter.com/ulUrHXWWqd
— C L N Raju (@clnraju) May 18, 2024
ఈనెల 13న జరిగిన పోలింగ్ రోజు, తరువాత జరిగిన మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలపై వెంటనే స్వయంగా వచ్చి నివేదికలను అందజేయాలని ఆదేశించిన మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లి నివేదికను అందజేశారు. సీఈసీ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్‌ను, మూడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడంతో ఖాళీ అయిన పోస్టులలో కొత్తవారిని నియమించింది.