
సింగపూర్ నాలుగో ప్రధాన మంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా.. వాంగ్ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్లిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన నాయకులే. వాంగ్ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహిస్తారు. దేశాధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం (67) వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే లూంగ్ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్ సర్కారులోనూ అవే పదవులను చేపట్టనున్నారు. 2025 నవంబర్‌లో సింగపూర్ పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.
