Hyderabad, May 17: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మూవీ ‘కల్కి 2898AD’ (Kalki 2898 Ad). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా, లోకనాయకుడు కమల్ హాసన్ (kamal Hassan) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ ఉంటుందట. దాని పేరు బజ్జి అంట. సదరు బుజ్జిని రేపు (మే18 శనివారం) సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు తెలియజేశారు. మరీ ఆ బుజ్జి ఎలా ఉంటుంది. అది రోబోనా, లేక మరేదైనా అన్న విషయం తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు.
Can’t wait for you to meet our Bhairava’s #Bujji.
𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 out Tomorrow at 5 PM. #Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/mkR679l27C
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 17, 2024
కాగా.. ఈ ఉదయం ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. డార్లింగ్స్, ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్‌లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటే పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా ప్రభాస్ పెళ్లి గురించి ఏమోనని అనుకున్నారు. ఈ బుజ్జి గురించే అనే విషయం తాజాగా అర్థమవుతోంది.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది.