Kalki 2898 AD (photo-Twitter)

Hyderabad, May 18: ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నిన్న ప్రభాస్ కల్కి సినిమా నుంచి నా బుజ్జిని పరిచయం చేస్తా అని పోస్ట్ చేయడంతో అంతా ఆ అప్డేట్ కోసం ఎదురుచూశారు. బుజ్జి అంటే ఏంటి? అన్న ప్రశ్నకు సమాదానం దొరికింది. ‘మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది’ అని తెలిపారు.

 

బుజ్జి మాట్లాడుతోంది.. ‘సచ్చినోడా’ అంటూ తిట్లు కూడా తిడుతోంది. బుజ్జిని తయారు చేసిన వారిని ఈ వీడియోలో పరిచయం చేశారు. ‘బుజ్జి అంటే వాహనం మాత్రమే కాదు.. ఇదో సూపర్ హీరో’ అని కూడా చెప్పారు. ఇక కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని నటిస్తుండగా వారితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారని సమాచారం. ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ పై కన్నేశాడు ప్రభాస్.