కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, సంగప్ప తదితరులు మహేశ్వర్‌రెడ్డిని వెంట పెట్టుకుని మహేశ్వర్‌ను తరుణ్ చుగ్‌కు కలిపించారు. కాంగ్రెస్ రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం, నోటీసుల నేపథ్యంలో నొచ్చుకుని ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)