Hyd, January 12: తాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే నేను చెబుతున్నాను..కానీ అవినీతి కాలేదని నేను చెప్పలేదు అన్నారు. మూసీ పై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసి నిద్ర చేశారు..వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే AC లు పెట్టించుకుని పడుకున్నారు అన్నారు.
వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుండి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాడు..నేను ఫైటర్ ను.. ఉప ఎన్నికను బయపడను అన్నారు. నేను ఎప్పుడో జరిగిన అంశం పై స్టేట్మెంట్ ఇచ్చాను.. హైడ్రా పై ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాను అన్నారు. దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారు అన్నారు.
తానేమీ కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. ఈ కార్ రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు అన్నారు. దానిపై నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను..ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని.. ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెట్టిల్ అయ్యాయి..హైదరాబాద్ సేఫెస్ట్ సిటి కాబట్టి ముంబై కి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడి కి వస్తున్నారు అన్నారు. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను కేటీఆర్ పై మాట్లాడను..పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే కాలిగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లా సమావేశం రసాభాస, సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం, ఒరేయ్ అంటూ ఎమ్మెల్యేను సంబోంధించిన కౌశిక్.. వీడియో
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలాగైనా నెరవేర్చాలని ముందుకెళ్తోంది..రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండే.. కానీ చేయలేదు అన్నారు. హైడ్రా పై నా వాఖ్యలు ఇప్పుడు కూడా మారదు.. ప్రభుత్వం ఆలోచించి హైడ్రా పై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నా అన్నారు. మూసీ కి ఆనుకుని హై కోర్టు.. ఉస్మానియా లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి..మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.