Hyderabad, Jan 12: సంక్రాంతి (Sankranti) రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 కోచ్ లతో రైలు ప్రయాణిస్తుండగా సోమవారం నుంచి మరో 8 జోడిస్తున్నట్టు తెలిపింది. దీంతో మొత్తం కోచ్‌ల సంఖ్య 16కు పెరగనుంది. అలాగే, ప్రస్తుతం 530 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, రేపటి నుంచి 1,128 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
Vande Bharat: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ కోచ్లు 16కు పెంపు#TeluguNews #Eenadu #VandeBharat https://t.co/hQ2LCmSsae
— Eenadu (@eenadulivenews) January 12, 2025
చైర్ కార్‌ల సంఖ్య 14
గత ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విశాఖపట్నం-హైదరాబాద్ వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్ కార్ లు 7 ఉన్నాయి. తాజా పెంపుతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌ల సంఖ్య రెండుకు, చైర్ కార్ ల సంఖ్య 14కు పెరుగుతుంది.