Daaku Maharaaj (Credits: X)

Hyderabad, Jan 12: బాలయ్య (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. కాగా, డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. బలి ఇచ్చిన గొర్రె రక్తాన్నిఅద్ది డాకు మహారాజ్ పోస్టర్ కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు 

Here's Video:

నెట్టింట విమర్శలు

కాగా, సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు.

సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు