Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో మధుమేహం సమస్య రోజురోజుకు పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో అధిక షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని అనారోగ్య సంకేతాలు కనిపిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులకు దారితీస్తుంది. అయితే అధిక షుగర్ వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు- షుగర్ లెవెల్స్ అధికంగా పెరగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి రక్తంలో చక్కెర లెవెల్స్ పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ లెవెల్స్ ను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి.
Astrology: జనవరి 17 రాత్రి చంద్రుడు ,బుధుడు ఒకే రాశిలోకి ప్రవేశం
మెదడుకు సంబంధం వ్యాధులు- రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మెదడు సంబంధం వ్యాధులు వస్తాయి. మెదడులో నాడీ వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదాలు ఉన్నాయి. దీనివల్ల మతిమరుపు డిమాండ్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉండేలాగా చూసుకోవాలి.
దంత సమస్యలు- షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల చిగుళ్ల వ్యాధి పనులు ఊడిపోవడం చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడతాయి. షుగర్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి షుగర్ లెవల్ ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఫ్యాటీ లివర్- షుగర్ ఎక్కువగా ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాలయం పనితీరు మందగిస్తుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ పేరుకు పోతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది ఇది మధుమేహం ఎక్కువ ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.