Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడికి ,బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 17, 2025 వ సంవత్సరంలో శనివారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు చంద్రుడు బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తారు. దీని కారణంగా అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి- వృషభ రాశి వారికి చంద్రుడు బుధ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. మీరు కొత్త కొత్త ప్రణాళికలను చేపడతారు. అవి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కొత్త ఇంటిని ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
కన్య రాశి- కన్య రాశి వారికి ఆ చంద్రుని బుధలని అనుగ్రహం ఈ రాశి పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బుధుడు, చంద్రుడి ఆశీస్సులు మీపైన ఉండడం వల్ల మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి మీకు లాభాలను తీసుకొని వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కళ నెరవేరుతుంది.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి చంద్రుడి బుధుని గ్రహాల కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి. డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తులు వస్తాయి. కోర్టు సంబంధ సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మానసిక ఆందోళనను తొలగిస్తుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కోరుకున్నచోట సీటు లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.