Sports

PV Sindhu Wins Swiss Open 2022: ఈ ఏడాది రెండో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న పీవీ సింధు, స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 ఛాంపియన్‌గా అవతరించిన తెలుగుతేజం

Hazarath Reddy

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ చాంపియన్‌గా అవతరించింది.

CM Jagan Congrats Pv Sindhu: పీవీ సింధును అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, మన జాతి గర్వించేలా చేశావు అంటూ ట్వీట్

Hazarath Reddy

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింధును అభినందించారు.

ICC Women’s World Cup 2022: ప్రపంచకప్ ఆశలు ఆవిరి..దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిన భారత మహిళల క్రికెట్ టీం, ఓటమితో ఐదో స్థానంతో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ

Hazarath Reddy

భారత మహిళల వరల్డ్‌కప్‌ కల మరోసారి భగ్నమైంది. సెమీస్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) గత రన్నరప్‌ టీమిండియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

Women's World Cup 2022: మీరు దేశం గర్వించేలా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు, భారత మహిళా క్రికెట్ టీంను ప్రశంసించిన విరాట్ కోహ్లీ

Hazarath Reddy

మిథాలీ రాజ్ & కో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళల జట్టుకు తన మద్దతును అందించాడు.

Advertisement

IPL 2022: ముంబైకి కష్టాల మీద కష్టాలు, కెప్టెన్ రోహిత్‌ శర్మకు 12 లక్షల జరిమానా, నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఫైన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ( Mumbai Indians captain Rohit Sharma) ఫైన్‌ వేశారు. స్లో ఓవర్‌ రేటు కారణంగా అతడికి 12 లక్షల జరిమానా విధించారు.

IPL 2022: ముంబై మరో చెత్త రికార్డు, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌, కుల్దీప్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.

IPL 2022: దుమ్మురేపిన పంజాబ్, బెంగుళూరు విసిరిన 206 పరుగులను 19 ఓవర్లలోనే చేధింపు, చివర్లో మెరుపులు మెరిపించిన ఓడియన్‌ స్మిత్‌, షారుక్‌

Hazarath Reddy

భారీ ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. 18వ ఓవర్‌లో స్మిత్‌ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు సాధించడంతో ఉత్కంఠ వీడింది.

IPL 2022 CSK vs KKR: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా, ధోనీ పోరాడినా కూడా చెన్నైకి దక్కని విజయం, దుమ్మురేపిన కోల్‌కతా బౌలర్లు

Naresh. VNS

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (CSK) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44(Rahane) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Advertisement

IPL 2022: ఐపీఎల్ తొలి పోరు నేడే, వాఖండే స్టేడియంలో రాత్రి 7. 30 నుంచి తలపడనున్న చెన్నై, కోలకతా, మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఈ ఏడాది ఐపీఎల్

Hazarath Reddy

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా సగం మ్యాచ్ (IPL 2022) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది.

IPL 2022: ధోనీ అభిమానులకు షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగిన ఎంఎస్ ధోనీ, కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

Hazarath Reddy

IPL 2022కి ముందు MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రవీంద్ర జడేజా ఈ సీజన్ నుండి జట్టుకు కొత్త నాయకుడిగా ప్రకటించబడ్డాడు. "ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని మరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.

Ashleigh Barty Retires: ప్రపంచ నెంబర్‌ వన్‌ సంచలన నిర్ణయం, షాక్‌లో అభిమానులు.. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ

Hazarath Reddy

ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ నెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానులను నిరాశపరుస్తూ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్‌ చేసింది.

ICC Women’s World Cup 2022: సెమీస్ ఆశలు సజీవం, 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసిన భారత్ మహిళా జట్టు

Hazarath Reddy

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దుమ్మురేపింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Advertisement

Womens World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైన భారత్

Hazarath Reddy

ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. వెస్టిండీస్‌పై ఘన విజయంతో జోరు మీద కనిపించిన మిథాలీరాజ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌ ముందు కుదేలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన పోరులో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

David Warner: డేవిడ్ వార్నర్‌ వీడియోపై భార్య కాండీస్‌ సెటైర్, ఇలాంటి పనులు మన ఇంటిలో కూడా చేయవచ్చు కదా అని ట్వీట్, వైరల్ అవుతున్న వార్నర్ వీడియో

Hazarath Reddy

వార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.

IPL 2022: ఆర్సీబీకి కొత్త కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు

Hazarath Reddy

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది.

IPL vs PSL: రూ. 16 కోట్లకు మీ పాకిస్తాన్‌లో ఏ ఆటగాడినైనా కొంటారా, రమీజ్ రాజా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా

Hazarath Reddy

ఐపీఎల్ కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది నుంచి తాము సైతం ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటున్నట్టు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) చేసిన ప్రకటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) స్పందించాడు.

Advertisement

Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్, ఫిట్‌ నెస్‌ టెస్టులో పృథ్వీ షా విఫలం, కనీస స్కోరును అందుకోలేక చేతులెత్తేసిన షా, అయినా ఫర్వాలేదంటున్న టీం

Naresh. VNS

ఐపీఎల్‌కుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ టీంలో కీలక ఆటగాడిగా ఉన్న పృధ్వీ షా ఫిట్ నెస్ టెస్టులో విఫలమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఐపీఎల్‌ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్‌ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు.

Ravichandran Ashwin: రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

Hazarath Reddy

టీమిండియా స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు.

Sandeep Singh Shot Dead: కబడ్డీ టోర్నీమెంట్‌‌లో కాల్పుల కలకలం, అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌ సందీప్ నంగల్‌‌పై 20 రౌండ్లు కాల్పులు, అక్కడికక్కడే కుప్పకూలిన భారత స్టార్‌ రైడర్‌

Hazarath Reddy

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌, భారత స్టార్‌ రైడర్‌ సందీప్ నంగల్‌ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్‌ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్‌ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.

India vs Sri Lanka 2nd Test: కపిల్‌దేవ్ సరసన పంత్, పింక్ బాల్ టెస్ట్‌ లో అద్భుతం చేసిన రిషబ్, శ్రీలంకకు ముచ్చెముటలు పట్టిస్తున్న టీమిండియా, రెండోరోజు ఫర్మామెన్స్ ఇరగదీసిన బ్యాట్స్ మెన్

Naresh. VNS

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 303/9 దగ్గర డిక్లేర్ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఇవాళ ఆట ఆరంభంలోనే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే పరిమితం చేసిన రోహిత్ సేన… ఆపై రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ఆరంభించింది. రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు

Advertisement
Advertisement