Sports

IPL 2022: దుమ్మురేపిన బెంగుళూరు, రాజస్థాన్‌పై అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్, చివర్లో మెరుపులు మెరిపించిన షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్

Hazarath Reddy

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ విసిరిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుతిరిగారు.

Ross Taylor: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌, సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌ ద్వారా కెరీర్‌కు గుడ్ బై, ఘనంగా వీడ్కోలు పలికిన న్యూజీలాండ్ టీం

Hazarath Reddy

కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ నెదర్లాండ్స్‌తో మూడో వన్డేతో క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. ఆఖరి మ్యాచ్‌లో అతడు 14 పరుగులే చేసినా.. వన్డేలో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌..టేలర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో రాస్‌కిది 450వ మ్యాచ్‌ కావడం విశేషం.

IPL 2022: హైదరాబాద్‌కు ఏమైంది, వరుసగా రెండో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం, సన్‌రైజర్స్‌ బ్యాటర్ల భరతం పట్టిన లక్నో బౌలర్ అవేశ్‌ ఖాన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 15వ సీజన్‌ తొలి పోరులో రాజస్థాన్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌.. సోమవారం జరిగిన రెండో పోరులో (SRH vs LSG Stat Highlights, IPL 2022) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది

IPL 2022: దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో విక్టరీ సాధించిన గుజరాత్, అదరగొట్టిన బౌలర్స్, రిషబ్ పంత్ పోరాడినా దక్కని గెలుపు

Naresh. VNS

ఢిల్లీ కేపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది.

Advertisement

IPL 2022: ఆండ్రీ రసెల్‌ విధ్వంసం, పంజాబ్‌పై ఘన విజయం సాధించిన కేకేఆర్‌, 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన కోలకతా నైట్ రైడర్స్

Hazarath Reddy

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్‌ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్‌ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్‌ మెరుపులు మెరిపించాడు.

IPL 2022: అరుపులతో హడలెత్తించిన గౌతమ్ గంభీర్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం తర్వాత గౌతం గంభీర్ సెలబ్రేషన్స్ వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

IPL 2022: ఎంత పనిచేశావయ్యా రాహుల్, షూని అలా పిచ్ మధ్యలో వదిలేస్తావా, డికాక్ షూ తీసుకువస్తున్న వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌ 2022లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ​లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కేఎల్‌ రాహుల్‌ తొలి ఓవర్‌లోనే తన షూను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి మ్యాచ్‌ జరుగుతున్న ముంబైలో అధిక వేడిమి కారణంగా కేఎల్‌ రాహుల్‌కు చెమట విపరీతంగా వచ్చింది.

IPL 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్, 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయిన చెన్నై

Hazarath Reddy

రెండు సూపర్‌ పవర్‌ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌దే (LSG vs CSK Stat Highlights, IPL 2022) పైచేయి అయింది. ఇక ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటిసారిగా తమ ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయింది.

Advertisement

Pornstar Kendra Lust: మహ్మద్‌ షమిపై పోర్న్ స్టార్ ప్రశంసలు, ఎందుకు అభినందించిందో అర్ధంకాని అయోమయంలో ఫ్యాన్స్

Hazarath Reddy

గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమిని అమెరికన్‌ పోర్న్‌స్టార్‌ కెండ్రా లస్ట్‌ ప్రశంసలతో ముంచెత్తింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన షమి (3/25) జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.

Rahul Mankad Dies: భారత క్రికెట్‌ దిగ్గజం వినూ మన్కడ్‌ కుమారుడు రాహుల్‌ మన్కడ్‌ మృతి, అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో కన్నుమూత

Hazarath Reddy

భారత క్రికెట్‌ దిగ్గజం వినూ మన్కడ్‌ కుమారుడు, మాజీ క్రికెటర్‌ రాహుల్‌ మన్కడ్‌ (66) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో తుదిశ్వాస విడిచాడు. వినూ మన్కడ్‌ మూడో కుమారుడు రాహుల్‌ 1972 నుంచి 85 వరకు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

IPL 2022: కోల్‌కతాపై బెంగళూరు విజయం, నాలుగు వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేసిన డిసిల్వా

Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల ఖాతా తెరిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన స్వల్ప స్కోరింగ్‌ మ్యాచ్‌లో (RCB vs KKR Stat Highlights, IPL 2022) బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఆర్‌సీబీకి తొలి విజయం కాగా ఆరంభ మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన కేకేఆర్‌కు మొదటి ఓటమి

Virat Kohli: విరాట్ కోహ్లీనే మళ్లీ నంబర్ వన్, వరుసగా ఐదో ఏడాదీ భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీగా రికార్డు, రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానం

Hazarath Reddy

కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా, జట్టు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాదీ కోహ్లీనే నెంబర్‌వన్‌గా నిలిచాడు. 2021 ఏడాదికిగాను డఫ్‌ అండ్‌ ఫెల్ఫ్స్‌ సంస్థ ప్రకటించిన భారత మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలెబ్రిటీల్లో విరాట్‌.. రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

Advertisement

Chris Gayle: మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న క్రిస్ గేల్, వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా అంటూ పోస్ట్

Hazarath Reddy

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరుడు క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్‌ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ను బట్టి చూస్తే అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Virat Kohli: మరింతగా దిగజారిన విరాట్ కోహ్లీ, కెప్టెన్సీతో పాటుగా బ్రాండ్ వాల్యూ కూడా కోల్పోయిన క్రికెట్ దిగ్గజం

Hazarath Reddy

కెప్టెన్సీ తన చేతిలో వుండగా విరాట్ కోహ్లీ కార్పొరేట్ సంస్థల దృష్టిని విపరీతంగా ఆకర్షించాడు. డఫ్ అండ్ ఫెల్స్ రిపోర్టుల ప్రకారం ఒకప్పుడు 237.7 మిలియన్ డాలర్లుగా వున్న విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ, కెప్టెన్సీ పోయాక దారుణంగా తగ్గిపోయింది.

RR vs SRH, IPL 2022: హైదరాబాద్‌ జట్టుకు మరో బిగ్ షాక్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు రూ. 12 లక్షల జరిమానా, స్లో ఓవర్‌ రేటు విషయంలో భారీ జరిమానా

Hazarath Reddy

రాజ‌స్థాన్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. కనీస ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేయని కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.

IPL 2022: ఓటమితో ఐపీఎల్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

Hazarath Reddy

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవంగా ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్‌ సేన (SRH vs RR Stat Highlights, IPL 2022) ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో (Rajasthan Royals Big Win) ఓడింది.

Advertisement

IPl 2022: 145 కి.మీ.ల వేగంతో దుష్మంత చమీరా యార్కర్, తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయిన విజయ్‌ శంకర్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

IPL 2022: లక్నోపై విరుచుకుపడిన షమీ, ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్, 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం

Hazarath Reddy

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

PV Sindhu Wins Swiss Open 2022: ఈ ఏడాది రెండో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న పీవీ సింధు, స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 ఛాంపియన్‌గా అవతరించిన తెలుగుతేజం

Hazarath Reddy

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ చాంపియన్‌గా అవతరించింది.

CM Jagan Congrats Pv Sindhu: పీవీ సింధును అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, మన జాతి గర్వించేలా చేశావు అంటూ ట్వీట్

Hazarath Reddy

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింధును అభినందించారు.

Advertisement
Advertisement