Sports
India vs England 2nd Test 2021: భారత్ భారీ విజయం, రెండో టెస్టులో చిత్తయిన ఇంగ్లండ్, 317 ప‌రుగుల భారీ విజ‌యంతో తొలి టెస్ట్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
Hazarath Reddyచెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం (IND Beat ENG) సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది.
FIR Filed against Yuvraj: యువరాజ్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు, ఇప్పటికే క్షమాపణ కోరిన యువీ
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా యువరాజ్‌ సింగ్‌.. మరో క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ (Yuzvendra Chahal) కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు
India vs England 1st Test 2021: భారత్ ఘోర పరాజయం, 227 పరుగుల తేడాతో తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్, ఈ విజయంతో ఆరు వరసు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్
Hazarath Reddyచిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం (India vs England 1st Test 2021) పాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో భారీ ఓటమి మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(72), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ నదీం డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచారు.
Uttarakhand Glacier Burst: ఉత్తరాఖండ్ జల విలయం, మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించిన పంత్, ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తానంటూ ట్వీట్
Hazarath Reddyటీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఉత్తరాఖండ్‌ జల విలయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో కార్మికులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ జలప్రళయం (Uttarakhand Glacier Burst) సందర్భంగా సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని రిషబ్ (Rishabh Pant) ప్రకటించారు.
India vs England 1st Test 2021: తడబడుతున్న ఇండియా, 56 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసిన టీం ఇండియా, కొనసాగుతున్న బ్యాటింగ్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్
Hazarath Reddyచిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్సులో 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 225 పరుగులు (India vs England 1st Test 2021) చేసింది.
MS Dhoni: ధోనీ సరికొత్త రికార్డు, ఐపీఎల్‌లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన మహేంద్రుడు, రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ
Hazarath Reddyభారత క్రికెట్ మాజా కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్‌ ధోనీ మరో రికార్డుకు చేరుకున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రూ.150 కోట్లను (Rs.150 Crores In IPL) ఆర్జించిన తొలి క్రికెటర్‌గా(భారత్ లేదా విదేశీ) మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చరిత్ర సృష్టించాడు.
Sourav Ganguly Hospitalised: మళ్లీ చాతి నొప్పి, అపోలో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ, జనవరి 2న గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు, త్వరగా కోలుకోవాలని పలువురు ట్వీట్
Hazarath Reddyభారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా (Sourav Ganguly Hospitalised) మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది.
Siraj Pays Homage to Late Father: తండ్రి సమాధి వద్ద టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రార్థనలు, తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగం, తనకు ఆస్ట్రేలియా సిరీస్ చిరస్మరణీమైనదని వ్యాఖ్య
Team Latestlyఇది చాలా కఠినమైన పరిస్థితి. తండ్రి మరణవార్త విన్న తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వెళ్లిపోవాలా? అక్కడే ఉండిపోవాలా? ఏం తోచని స్థితిలోకి వెళ్లాను. తాను ఎప్పటికైనా భారత జట్టుకు ఆడతానని నాన్న చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మతో....
India vs Australia 4th Test 2021: ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం, టెస్ట్‌ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఇండియా, ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసిన రిషబ్ పంత్, గబ్బా మైదానంలో 32 ఏళ్ళ తర్వాత ఆసీస్ తొలి ఒటమి
Hazarath Reddyగబ్బా మైదానంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో (India vs Australia 4th Test 2021) టీమిం‍డియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్‌ ఛేదించింది. రిషభ్‌ పంత్‌ దూసుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయాన్ని సాధించింది.
India vs Australia 4th Test: చరిత్ర తిరగ రాసేందుకు అడుగు దూరంలో భారత్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్ట్‌లో విజయం వైపుగా దూసుకెళుతున్న ఇండియా
Hazarath Reddyబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో (India vs Australia 4th Test Day 5) భారత్‌ పట్టుబిగిస్తోంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా సాగుతోంది
Sourav Ganguly Hospitalised: సౌరవ్ గంగూలీకి గుండెపోటు, ఆపరేషన్ చేయాలని సూచించిన వైద్యులు, కలకత్తాలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిక
Hazarath Reddyబీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. కాగా వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం, తీవ్రమైన ఛాతీ నొప్పితో (Sourav Ganguly Heart Problems) గంగూలీ బాధపడ్డారు.
Azharuddin: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు బోల్తా, ప్రమాదంలో అజర్‌కు గాయాలు, క్షేమంగానే ఉన్నారని వ్యక్తిగత సహాయకుడి వివరణ
Team Latestlyహైవేపై టర్నింగ్ వద్ద టైరు పేలడంతో కారు ఓవర్ టర్న్ అయి అదుపుతప్పి బోల్తా పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే హైవేకి పక్కన ఉండే దాబాలోకి కారు దూసుకురావడంతో దాబాలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత అజర్ ను మరొక కారులో అక్కణ్నించి తరలించారు....
India vs Australia 2nd Test: బాక్సింగ్‌డే టెస్టులో భారత్‌ ఘన విజయం, ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు, రెండు జట్ల చెరో విజయంతో సిరీస్ 1-1తో సమం, జనవరి 7 నుంచి మూడో టెస్ట్
Hazarath Reddyఆస్ట్రేలియాతొ జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో (India vs Australia 2nd Test) గెలిచింది. శుభ్‌మన్ గిల్(35 నాటౌట్), రహానే(27 నాటౌట్) పరుగులతో భారత్‌ను విజయతీరాలకు ( IND Beat AUS by 8 Wickets, Level Series 1-1) చేర్చారు. దీంతో మొదటి టెస్టు పరాజయానికి రహానే సేన ప్రతీకారం తీర్చుకుంది.
Virat Kohli: ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీ, గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్న పరుగుల వీరుడు, కోహ్లీ విజయాలను వివరిస్తూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిసి ఐసీసీ
Hazarath Reddyఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా (Kohli Named ICC Male Cricketer of the Decade)నిలిచి స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్నాడు. అంతేకాదు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లినే వ‌రించింది.
Suresh Raina Arrested: ముంబైలో క్రికెటర్ సురేశ్ రైనా అరెస్ట్, కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ అదుపులోకి తీసుకున్నామని తెలిపిన పోలీసులు, బెయిల్‌పై విడుదల
Hazarath Reddyటీం ఇండియా క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు (Suresh Raina Arrested) చేశారు. అతడితో పాటు సింగర్ గురు రంధ్వానాను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై (Dragonfly Pub) ఆకస్మిక దాడి చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు మరో 34 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు క్లబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
COVID-19: కరోనా కారణంగా ఇద్దరు మిత్రులను కోల్పోయిన సచిన్, కోవిడ్‌తో మరణించిన విజయ్ షిర్కే, అక్టోబర్‌లో కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిన అవీ కదమ్
Hazarath Reddyభారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
India vs Australia 1st Test 2020: ఘోరాతి ఘోరంగా..చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీం ఇండియా, 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసీస్ ఘన విజయం
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో (India vs Australia 1st Test 2020) 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించింది. 36/9 పరుగుల దగ్గర భారత రెండో ఇన్నింగ్స్ (AUS Win Series Opener by 8 Wickets) ముగిసింది. దీంతో 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Team India XI: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గిల్, పంత్, కేఎల్ రాహుల్‌లకు దక్కని చోటు, డిసెంబర్ 17 నుంచి పింక్ బాల్‌తో డే అండ్ నైట్ టెస్ట్‌తో సిరీస్ ప్రారంభం
Team Latestlyతుది జట్టులో ఒపెనర్లుగా మయాంక్ అగర్వాల్‌, పృథ్వీ షా చోటు సంపాదించగా, రిషబ్ పంత్‌ను వెనక్కి నెట్టి వృద్దిమాన్ సాహా వికెట్ కీపర్ స్లాట్‌ను దక్కించుకున్నాడు. కాగా, పృథ్వీ షా ఎంపిక క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వార్మప్ మ్యాచ్ లలో పృథ్వీ దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో....
India vs Australia 3rd T20I: పోరాడి ఓడిన ఇండియా, 12 పరుగుల తేడాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం, భారత్‌ని గెలిపించని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం
Hazarath Reddyమూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో (India vs Australia 3rd T20I) టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. ఆస్ట్రేలియా12 పరుగుల తేడాతో విజయం (AUS Beat IND by 12 Runs) సాధించి వైట్‌వాష్ నుంచి బయటపడింది.
IND vs AUS 2nd T20I 2020: వన్డే సీరిస్‌కు ప్రతీకారం, టీం 20 సీరిస్ ఇండియాదే, వరుసగా రెండో టీ20లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్, మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఇండియా
Hazarath Reddyఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.