Sports

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌, భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో పతకం గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారీ

Vikas M

పారాలింపిక్స్‌లో భారత్‌ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో ప్రపంచ ఛాంపియన్‌ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.

Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా, స‌లీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ

Vikas M

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా(Ajay Ratra) ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

Vikas M

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

Advertisement

ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

Vikas M

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

Sheetal Devi's Bullseye Shot Video: కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు ఫిదా అయిన సెలబ్రిటీలు, ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌ అంటూ విషెస్

Vikas M

పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు

Sheetal Devi's Bullseye Shot: ఆర్చర్ శీతల్ దేవి అదిరిపోయే షాట్‌ వీడియో ఇదిగో, నీకు కారు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Vikas M

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మనీషా రాందాస్

Vikas M

SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మనీషా రాందాస్ పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల పట్టికలో మరో పతకాన్ని జోడించింది. ఆమె తన కాంస్య పతక మ్యాచ్‌లో 21-12, 21-8తో ఆధిపత్యం చెలాయించడం ద్వారా 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 10వ పతకాన్ని ఖాయం చేసింది.

Advertisement

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న తులసిమతి మురుగేషన్

Vikas M

పారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం, సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ SU5 పారా-బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో తులసిమతి మురుగేషన్ ఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియా చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Paralympic Games 2024:పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియా

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 27 ఏళ్ల అతను తన మొదటి ప్రయత్నంలో వచ్చిన 42.22 మీటర్ల త్రోను తీసి పోడియం ఫినిషింగ్ సాధించాడు. కథునియా కోసం ఇది సీజన్‌లో అత్యుత్తమ ప్రయత్నం

Sivarajan Solaimalai: అద్భుత వీడియో.. పారా షట్లర్ శివరాజన్ సొలైమలై స్టన్నింగ్ షాట్, ప్రేక్షకులని థ్రిల్‌ చేసిన వీడియోలు

Arun Charagonda

పారాలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు శివ‌రాజ‌న్ సొలైమ‌లై. మ్యాచ్ ఓడినా అద్భుత ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. శివ‌రాజ‌న్ కొట్టిన కొన్ని షాట్స్ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేశాయి. ప్రత్యర్థి సైతం అవాక్కయ్యేలా స్టన్నింగ్ షాట్స్ కొట్టారు శివరాజన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం

Vikas M

ఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో నాలుగో ప‌త‌కం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో రజత పతకం సాధించిన మనీష్ నర్వాల్

Hazarath Reddy

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత పారా షూటర్ మనీష్ నర్వాల్ 234.9 స్కోరుతో రజత పతకాన్ని సాధించాడు. 237.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్డు జో చేతిలో నర్వాల్ ఓడిపోయాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం, కాంస్యంతో చ‌రిత్ర తిర‌గ‌రాసిన అథ్లెట్ ప్రీతి పాల్, ట్రాక్ విభాగంలో దేశానికి ఇదే తొలి ప‌త‌కం

Hazarath Reddy

ట్రాక్ విభాగంలో దేశానికి తొలి ప‌త‌కం సాధించి పెట్టింది. శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల 100 మీట‌ర్ల టీ35 ఫైన‌ల్లో ప్రీతి కాంస్యం ప‌త‌కం కొల్ల‌గొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం చేరింది. 100 మీట‌ర్ల ఫైన‌ల్లో ప్రీతి చిరుత‌లా ప‌రుగెత్తింది. 14.21 సెక‌న్ల‌లో ల‌క్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది, అవనీ లేఖా, మోనా అగర్వాల్‌లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రదాని మోదీ

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లలో పతకాలు సాధించిన పారా అథ్లెట్లు అవనీ లేఖా, మోనా అగర్వాల్ లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలియజేసేందుకు X, (ట్విట్టర్‌) లోకి వెళ్లారు.

Advertisement

Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది.

Avani Lekhara Wins Gold: పారిస్ పారాలింపిక్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల సంఖ్య మొదలయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్యంతో ముగియగా, అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌కు ప్రస్తుతం రెండు పతకాలు ఉన్నాయి.

Wheelchair Basketball Paralympics Google Doodle: పారాలింపిక్స్ 2024, వీల్ చైర్ బాస్కెట్‌ బాల్..ప్రత్యేక ఆకర్షణగా గూగుల్ డూడుల్

Arun Charagonda

పారిస్ వేదికగా పారాలింపిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటుండగా ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. పారాలింపిక్స్ సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్ విడుదల చేసింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ కు గుర్తుగా ఇవాళ స్పెషల్ డూడుల్‌ని రిలీజ్ చేసింది. 108 దేశాల్లో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండి వీల్ చైర్ బాస్కెట్ బాల్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరగనుండగా ఇందుకు సూచికంగా ఆకట్టుకునేలా గూగుల్ డూడుల్‌ని రూపొందించింది.

Joe Root: రికార్డులను తిరగరాస్తున్న జో రూట్, ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రికార్డు, టెస్టు కెరీర్‌లో 33వ సెంచ‌రీ నమోదు

Vikas M

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన లార్డ్స్ స్టేడియంలో శ్రీ‌లంక(Srilanka) బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ 33వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. త‌ద్వారా ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రూట్ రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స‌మం చేశాడు.

Advertisement
Advertisement