Sports

ICC T20I Team of the Year 2023: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్, ఐసీసీ 2023 అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, భారత్ నుంచి అయిదుగురికి చోటు

Hazarath Reddy

2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు

Unmukt Chand Vs Rohit Sharma: బీసీసీఐతో తెగతెంపులు, వచ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అమెరికా తరపున బరిలోకి దిగుతున్న ఉన్ముక్త్ చంద్‌, జూన్ 12వ తేదీన యుఎస్ఎతో భారత్ ఢీ

Hazarath Reddy

2012 అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు ప్రపంచకప్ అందించిన భార‌త అండ‌ర్ -19 జ‌ట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ అమెరికా తరపున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడిన ఈ యువ‌కెర‌టం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండ‌బోతుంద‌ని అన్నాడు.

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవార్డు, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలక్ట్ చేసిన బీసీసీఐ, వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్

Hazarath Reddy

టీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Glenn Maxwell Hospitalised: పీకల దాగా తాగి పబ్‌లోనే సోయలేకుండా పడిన గ్లెన్‌ మాక్స్‌వెల్, అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు, ఘటనపై విచారణ ప్రారంభించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.

Advertisement

India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ

Hazarath Reddy

BCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli

Ram Mandir Pran Pratishtha: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్న సచిన్ టెండూల్కర్, మరి కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Virat Kohli Reaches Ayodhya: రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య చేరుకున్న విరాట్ కోహ్లీ..(Viral Video)

sajaya

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి విరాట్ కోహ్లీ అయోధ్య చేరుకున్నాడు. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులలో స్టార్ క్రికెటర్ కూడా ఉన్నాడు. వైరల్‌గా మారిన వీడియోలో, స్టార్ క్రికెటర్ కారు అయోధ్యలో కనిపించింది.

KS Bharat Dedicates Century to Shree Ram: అయోధ్య రాముడికి ఇంగ్లాండ్ లయన్స్ జట్టుపై సాధించిన తన సెంచరీని అంకితం చేసిన తెలుగు బ్యాటర్ కెఎస్ భరత్..

sajaya

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే 5-టెస్టుల సిరీస్‌కు ముందు, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన నాల్గవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీని సాధించడం ద్వారా కెఎస్ భరత్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపికయ్యేందుకు బలమైన ప్రదర్శన అందించాడు. తన సెంచరీని అయోధ్య రాముడికి అంకితం చేశాడు.

Advertisement

India A vs England Lions: ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగే రెండు మ్యాచులకు భారత్ - A జట్టులో రింకు సింగ్, తిలక్ వర్మలకు చోటు

sajaya

ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగే చివరి రెండు మ్యాచ్ లకు భారత్ -ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ రింకు సింగ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అదే సమయంలో మరో ప్రత్యేక ఆటగాడికి అవకాశం దక్కింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగే చివరి రెండు మ్యాచ్లకు బోర్డు జట్టును ప్రకటించింది.

Shoib Malik Marriage: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్.. సానియాకు విడాకులు ఇచ్చాడా..లేదా..?

sajaya

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడిపోయారనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ పెళ్లి జరిగింది. షోయబ్ మాలిక్ తన జీవిత భాగస్వామిగా పాకిస్థానీ నటి సనా జావేద్‌ను ఎంచుకున్నాడు.

Virat Kohli Fielding Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే విరాట్ కోహ్లీ పీల్డింగ్ వీడియో ఇదిగో, 5 పరుగులను ఆపి భారత్ ను గెలిపించిన టీమిండియా రన్ మిషిన్

Hazarath Reddy

నజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమయం దాటిపోవటంతో బాల్ బౌండరీ లైన్ అవతలపడే సమయంలో గాల్లోకి ఎగిరి బాల్ ను మైదానంలోకి నెట్టేశాడు. దీంతో ఆరు పరుగులు వస్తాయనుకున్న అఫ్గాన్ బ్యాటర్ కు కోహ్లీ అద్భత ఫీల్డింగ్ తో ఒక్క పరుగుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Sachin Deepfake Video Case: సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో కేసు, యాప్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు

Hazarath Reddy

సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో విచారణలో భాగంగా యాప్ యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. IPC సెక్షన్ 500, IT చట్టంలోని సెక్షన్ 56 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

IND vs AFG 3rd T20: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, రెండో సూపర్ లో గట్టెక్కిన రోహిత్ సేన...భారత్, ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ 3-0తో భారత్ కైవసం

sajaya

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20 ఫలితం ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్లతో థ్రిల్లింగ్ గా ముగిసింది. తొలుత ఇరు జట్లు 212 పరుగులు చేసి మ్యాచ్‌ను టై అవడంతో తొలి సూపర్ ఓవర్ జరిగింది. తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు చెరో 16 పరుగులు చేసి మరోసారి మ్యాచ్‌ను టై చేయడంతో రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Rohit Sharma Century Video: వీడియో ఇదిగో, ఐదు సెంచరీలతో వరల్డ్ రికార్డ్‌ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఆప్ఘన్ బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

రోహిత్‌ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(1643 పరుగులు) అవతరించాడు

Most Centuries in T20Is: టీ20లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు, అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు

Hazarath Reddy

అఫ్గనిస్తాన్‌ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్‌ శర్మ పరుగుల దాహం తీరలేదు

Virat Kohli Golden Duck: టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్‌ డక్‌ అయిన విరాట్ కోహ్లీ, రన్ మిషన్ అవుట్‌ కాగానే నిశ్శబ్దంగా మారిపోయిన స్టేడియం

Hazarath Reddy

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత స్టార్ స్టార్ విరాట్ కోహ్లీ తన టీ20ఐ కెరీర్‌లో మొట్టమొదటి గోల్డెన్ డక్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం ఇది ఐదోసారి.

Advertisement

Defamation Case Against MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ధోనీపై పరువు నష్టం దావా వేసిన వ్యాపార భాగస్వామి

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్, దివాకర్ భార్య సౌమ్య దాస్ పరువు నష్టం దావా వేశారు.

Romario Shepherd Catch Video: వీడియో ఇదిగో, కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టిన రొమారియో షెపర్డ్‌

Hazarath Reddy

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విండీస్‌ ఆటగాడు, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అందుకున్నాడు. బౌలర్‌ నండ్రే బర్గర్‌ ఈ క్యాచ్‌ చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు.నిన్న (జనవరి 15) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

Virat Kohli Creates World Record: ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, ఇప్పటివరకూ ఏ క్రికెటర్ సాధించని రికార్డు సాధించిన టీమిండియా స్టార్

Hazarath Reddy

అంత‌ర్జాతీయ టీ20 పున‌రాగ‌మ‌నం ద్వారా టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి స‌రికొత్త ప్రపంచ రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వ‌ర‌కు ఏ క్రికెట‌ర్‌కూ సాధ్యం కాని ఫీట్ న‌మోదు చేశాడు.ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌ల‌లో 2000 ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి.

Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, కోహ్లీ కాళ్లు మొక్కి కౌగిలించుకున్న అభిమాని, విరాట్‌ క్రేజ్‌ చూసి ఆశ్చర్యపోతున్న ఇతర క్రికెటర్లు

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి క్రేజ్ తెలిపే మరో ఉదాహరణ. ఇండోర్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్‌ గ్రౌండ్‌ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు.

Advertisement
Advertisement