క్రీడలు
Latest ICC Test Player Rankings: ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి విరాట్ కోహ్లీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్‌ విరాట్ కోహ్లీనే. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్‌ నాలుగు స్థానాలు (761 రేటింగ్‌ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు.
Virat Kohli-Ram Siya Ram Song: రామ్‌ సియా రామ్ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో శ్రీరాముడులా ఫోజు ఇచ్చిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyకేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం సిబ్బంది రామ్ సియా రామ్ పాటను ప్లే చేసారు. విరాట్ కోహ్లీ చేతులు జోడించి విల్లు తీగ లాగుతూ శ్రీరాముడిలా ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళుతున్నప్పుడు కూడా రామ్ సియారామ్ సాంగ్ ప్లే చేశారు.
David Warner Retirement: వన్డేలకు గుడ్‌ బై చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
Rudraఇటీవలే టెస్ట్ ఫార్మాట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల చేశాడు.
Wrestling Body Office Moved Out: రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ పై క్రీడాశాఖ కీల‌క నిర్ణ‌యం, అక్క‌డి నుంచి ఆఫీస్ త‌ర‌లింపు, ఇకపై కొత్త కార్యాల‌యంలోనే కార్య‌క‌లాపాలు
VNSకొత్త కమిటీని రద్దు చేయడానికి ఇది ఒక కారణమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కార్యాలయాన్ని ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతానికి తరలించారు. ఇకపై కొత్త చిరునామా నుంచి ఈ కార్యాలయం పని చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Virat Kohli World Record: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేని రికార్డును సాధించిన విరాట్ కోహ్లీ, ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డలకెక్కాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు.
Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, మరోసారి రబడ చేతికే చిక్కిన టీమిండియా కెప్టెన్, టెస్టుల నుంచి రిటైర్‌ అయిపో అంటూ అభిమానులు ట్రోల్
Hazarath Reddyసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్‌ పేసర్‌ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం.
IND vs SA 1st Test 2023: సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం, తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల‌తో విజయం సాధించిన సఫారీలు
Hazarath Reddyసౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది.సెంచూరియ‌న్‌లో జ‌రిగిన‌ తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికా(South Africa) భారీ విజ‌యం సాధించింది
Formula-E Race Cancelled in Hyd: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఫార్ములా-ఈ ప్రతినిధులు
Hazarath Reddyఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు ఫార్ములా-ఈ ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా, “ఫార్ములా-ఇ రేసు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పంద కట్టుబాట్లపై ఫార్ములా ఇ వివరణ కోరినట్లు సమాచారం.
Kohli Breaks Rohit Sharma Record: రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
Hazarath Reddyసౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు
Pat Cummins Catch Video: వీడియో ఇదిగో, కమిన్స్ స్టన్నింగ్ క్యాచ్ దెబ్బకి బిత్తరపోయి చూసిన పాక్ బ్యాటర్ అబ్దుల్లా రెహ్మాన్‌
Hazarath ReddyAUS vs PAK 2వ టెస్ట్ రెండో రోజున అబ్దుల్లా రెహ్మాన్‌ను అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అదిరిపోయే డ్రాపింగ్ క్యాచ్ తీసుకున్నాడు. కమ్మిన్స్ ఫుల్-లెంగ్త్ బాల్‌ను అందించాడు. అబ్దుల్లా రెహమాన్ దానిని ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా అది కాస్తా కమిన్స్ చేతుల్లోకి వెళ్లింది
KL Rahul: ఒకే మైదానంలో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా సరికొత్త రికార్డు
Hazarath Reddyటీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.
Babar Azam Dismissal Video: వీడియో ఇదిగో, ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన బాబర్ ఆజం, ఆఫ్‌సైడ్‌ పడిన స్వింగ్ అవుతూ..
Hazarath Reddyఈ మ్యాచ్ లో బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది.
Star Sports Test Team Of The Year: టీంలో చోటు లేదంటూ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం, స్టార్‌ స్పోర్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు
Hazarath Reddyస్టార్‌ స్పోర్ట్స్‌ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ (Star Sports Test Team Of The Year) విడుదల చేసింది.
Kagiso Rabada: 28 ఏండ్లకే 500 వికెట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సౌతాఫ్రికా పేసర్‌ రబాడా, సఫారీల తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో ఏడో స్థానంలోకి..
Hazarath Reddyభారత్ మీద సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు.
IND vs SA 1st Test 2023 Day 1: ఐదు వికెట్లతో భారత్‌పై చెలరేగిన సఫారీ పేసర్ రబాడ, ముగిసిన తొలి రోజు ఆట, 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన టీమిండియా
Hazarath Reddyసెంచూరియన్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను 31 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్‌లు ముగించేసారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70 బ్యాటింగ్‌), సిరాజ్‌ ఉన్నారు.
Vinesh Phogat : ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన వినేష్ ఫోగట్..
sajayaమాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వెటరన్ రెజ్లర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వినేష్ ఫోగట్ తన అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. నా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అర్జున్ అవార్డును తిరిగి ఇస్తున్నాను అని ఫోగట్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Bajrang Punia Returns Padmashri Award: డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై నిరసన, పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన రెజ్లర్ బజరంగ్ పునియా
Hazarath Reddyవివాదాస్పద బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఇటీవలి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.దీనికి నిరసనగా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రెజ్లర్ బజరంగ్ పునియా గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు
Kohli Family Emergency: ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయలు దేరిన విరాట్ కోహ్లి, గాయంతో రుతురాజ్ గైక్వాడ్ దూరం
Hazarath Reddyఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు స్పష్టంగా లేవు,
IND vs SA 3rd ODI: వన్డే సిరీస్ గెల్చిన టీమిండియా...సౌతాఫ్రికా మీద 2-1తేడాతో వన్డే సిరీస్ కైవసం, సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'
sajayaటీమిండియా తన సొంత స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీం ఇండియా 78 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై విజయం సాధించింది.
Zimbabwe Suspends 2 Cricketers: డోప్ టెస్టులో ప‌ట్టుబ‌డ్డ జింబాబ్వే క్రికెట‌ర్లు, ఇద్ద‌రిపై వేటువేసిన బోర్డు, ఫిట్ నెస్ కోసం నిషేదిత డ్ర‌గ్స్ వాడిన‌ట్లు వెల్ల‌డి
VNSక్రికెట్ బోర్డు క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ(Disciplinary Committee) ముందు వెస్లీ, మ‌వుతా హాజ‌రుకానున్నారు. అ క‌మిటీ ముందు వీళ్లు త‌మ వాద‌న‌లు వినిపిస్తారు. . అనంత‌రం ఈ ఇద్ద‌రిపై ఎన్ని రోజుల నిషేధం విధిస్తారు అనేది కమిటీ నిర్ణ‌యం తీసుకోనుంది