క్రికెట్
IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బెంగుళూరు, అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా రికార్డు, లక్నో సూపర్‌జెయింట్స్‌పై అద్భుత విషయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
Hazarath Reddyరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొట్టింది. వరుణుడు అంతరాయం కారణంగా ఆలస్యంగా మొదలైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఆర్‌సీబీ(Royal Challengers Bangalore ) అద్భుత విజయం సొంతం చేసుకుంది.
IPL 2022: ధోని చెత్త రికార్డును బ్రేక్ చేసిన సంజు శాంసన్‌, ఐపీఎల్‌-2022లో 13 సార్లు టాస్‌ ఓడిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌, 2012 సీజన్‌లో 12 సార్లు టాస్‌ ఓడిన ధోనీ
Hazarath Reddyఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఓ చెత్తరికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా శాంసన్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో 13 సార్లు టాస్‌ ఓడిన శాంసన్‌.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
IPL 2022: మిల్లర్ మెరుపులు, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్
Hazarath Reddyఐపీఎల్ ఫైనల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అడుగు పెట్టింది. లీగ్‌ దశలో చక్కటి ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు ( Gujarat Titans Beat Rajasthan Royals) చేసింది.
IPL 2022: ఐపీఎల్ చ‌రిత్ర‌లో శిఖ‌ర్ ధావ‌న్ సరికొత్త రికార్డు, 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట‌ర్‌గా ఘనత, తరువాతి స్థానంలో డేవిడ్ వార్న‌ర్‌, విరాట్ కోహ్లీ
Hazarath Reddyఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ 2022 చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ధావ‌న్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
IPL 2022: రిష‌బ్ పంత్.. బ్రెయిన్ ఉందా అసలు, టిమ్ డేవిడ్ వంటి విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ విషయంలో రివ్యూ వాడుకోవాలని తెలీదా, ఫైర్ అయిన ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి
Hazarath Reddyఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌బ్ పంత్ తీరుపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు. టిమ్ డేవిడ్ విష‌యంలో రివ్యూ అడ‌గ‌క పోవ‌డాన్ని త‌ప్పు బ‌ట్టాడు. టిమ్ డేవిడ్ వంటి విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ ప‌రుగులు చేయ‌కుండానే ఔట‌య్యే అవ‌కాశం వ‌స్తే ఉప‌యోగించుకోరా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.
IPL 2022: ఓటమితో ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ 5 వికెట్లతో ఘన విజయం, కదం తొక్కిన లియామ్ లివింగ్ స్టోన్
Hazarath Reddyఈ ఏడాది ఐపీఎల్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ముగించింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్లతో హైదరాబాద్‌పై గెలిచింది.
MI vs DC Highlights: రిషబ్ పంత్ బిగ్ మిస్టేక్, ప్లే ఆఫ్స్‌కు ముంబై, ఆదుకున్న ఇషాన్ కిషన్, ఢిల్లీ ఘోర పరాజయం
Naresh. VNSటిమ్ డేవిడ్‌, తిల‌క్ వ‌ర్మ నిల‌క‌డ‌గా ఆడుతూ జ‌ట్టు విజ‌యానికి కార‌ణం అయ్యారు. అనిరిచ్ నార్ట్జే, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌బ్ పంత్.. క్యాచ్ మిస్ కావ‌డం, త‌ర్వాత డీఆర్ఎస్‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో భారీ మూల్య‌మే చెల్లించాల్సి వ‌చ్చింది
IPL 2022: ముంబైపై ఢిల్లీ ఓడితేనే బెంగుళూరు ప్లేఆఫ్స్‌కు, అర్ధ శతకంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ, గుజరాత్‌ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం
Hazarath Reddyప్లేఆఫ్స్‌ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) అద్భుతం చేసింది. ఫామ్‌ కోల్పోయాడనే విమర్శలకు బ్యాట్‌తో బదులిస్తూ విరాట్‌ కోహ్లీ (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
IPL 2022: కోల్‌క‌తాను ఇంటికి పంపిన క్యాచ్ వీడియో ఇదే, 30 గ‌జాల దూరం పరిగెత్తుకుంటూ వ‌చ్చి ఒంటి చేత్తో బంతిని అందుకున్న ఎవిన్ లివిస్
Hazarath Reddyఐపీఎల్‌లో బుధ‌వారం ల‌క్నో వ‌ర్సెస్ కోల్‌క‌తా మ్యాచ్‌లో ఎవిన్ లివిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో కోలకతా ఇంటికి బయలుదేరింది. 211 ర‌న్స్ భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చివ‌రి ఓవ‌ర్‌లో 21 ర‌న్స్ చేయాలి. అయితే ఆ ఓవ‌ర్‌లో తొలి నాలుగు బంతుల్లో రింకూ సింగ్ భారీ షాట్ల‌తో అల‌రించాడు
IPL 2022: 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు, 140 పరుగులతో డికాక్‌ విధ్వంసం, ఐపీఎల్‌ కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు డికాక్‌ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డికాక్‌కు ఐపీఎల్‌ కెరీర్‌లో రెండో సెంచరీ.
IPL 2022: గెలుపుతో ప్రారంభించి ఓటమితో ఇంటికి బయలుదేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిన శ్రేయస్‌ సేన
Hazarath Reddyఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌ ఓటమితో ముగించి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైన శ్రేయస్‌ సేన.. ప్రస్తుత ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 పరాజయాలు నమోదు చేసింది.
IPL 2022: అదేమి బ్యాటింగ్ క్వింటన్‌ డికాక్‌, పలు రికార్డులు బద్దలు కొట్టిన డికాక్-రాహుల్ ద్యయం, 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో
Hazarath Reddyఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య పోరు ఫ్యాన్స్‌కు విందు భోజనం అందించింది. బుధవారం జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో (IPL 2022) లక్నో 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన రెండో కొత్త జట్టుగా లక్నో నిలువగా, నిరుటి రన్నరప్‌ కోల్‌కతా తమ ప్రస్థానాన్ని ( Kolkata Get Eliminated) ముగించింది
IND vs SA: భారత టూర్‌కి సఫారీలు రెడీ, పొట్టి ప్రపంచకప్‌ తర్వాత సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికా జట్టు పూర్తి వివరాలు ఇవే
Hazarath Reddyవచ్చే నెలలో టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌ ఇదే
IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం
Hazarath Reddyప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
IPL 2022: ఐపీఎల్‌లో ఈ సారి సిక్సర్ల మోత మాములుగా లేదు, ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధింకంగా 896 సిక్సర్లు నమోదు, 1000 సిక్సర్లు నమోదవడం ఖాయమే మరి
Hazarath Reddyఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాట్సెమెన్ల హవా కొనసాగుతుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి.
Matheesha Pathirana:శ్రీలంక నుంచి మరో లసిత్ మలింగా, తొలి బంతికే వికెట్ తీసుకున్న మతీషా పతిరనా, 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన యువ పేసర్‌
Hazarath Reddyఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్‌ మతీషా పతిరనా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా తనదైన శైలి ఆటతో రెచ్చిపోయాడు. జూనియర్‌ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు
IPL 2022: కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన ఢిల్లీ, 17పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం, 14 పాయింట్లతో నాలుగో స్థానంలోకి..
Hazarath Reddyసమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక సమయంలో అత్యవసర విజయంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగు పర్చుకుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో సోమవారం ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది.
Australian Cricketer Andrew Symonds Dies In Car Crash: ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ హఠాన్మరణం, కారు ప్రమాదంలో మృతి
Krishnaక్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.
IPL 2022: అంపైర్‌‌ని అయోమయంలో పడేసిన ధోనీ, వైడ్ ఇవ్వబోయి ఔట్ ఇచ్చిన అంపైర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ సమర్‌జిత్‌ సింగ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఒక బంతిని సమర్‌జిత్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌స్వింగర్‌ వేయగా.. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్‌ ధోని చేతుల్లో పడింది. అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని అప్పీల్‌ చేశాడు.