Virat Kohli (left) and Mohammed Shami (right) (Photo credit: Twitter @BCCI and @ICC)

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు.దీంతో పాటుగా త్వ‌ర‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల‌కు కూడా భార‌త జ‌ట్టును (India Squad)ప్ర‌క‌టించారు. ముంబయిలో 15 మందితో కూడిన టీమిండియా ఎంపికపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

 మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన భారత క్రికెటర్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్ మాన్ గిల్ వ్యవహరిస్తారని బీసీసీఐ వెల్లడించింది. జస్ప్రీత్ బుమ్రా గాయం నయం కావడంతో అతడికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్ లకు కూడా సంపాదించారు.గత కొన్నాళ్లుగా వన్డే టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మహ్మద్ సిరాజ్‌ను మాత్రం సెలెక్ట్ చేయలేదు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

భారత జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

ఇక ఇంగ్లండ్‌తో జ‌రిగే వ‌న్డేల‌కు బుమ్రా ఆడ‌డంలేదు. ఫిబ్ర‌వ‌రిలో అత‌ని ఫిట్‌నెస్‌ను అంచ‌నా వేయ‌నున్నారు. ఒక‌వేళ బుమ్రా ఫిట్ అయితే ఆ టోర్నీలో అత‌ను ఆడుతాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్ కోసం బుమ్రా స్థానంలో హ‌ర్షిత్ రాణాకు చోటు క‌ల్పించారు. క‌రుణ్ నాయ‌ర్‌కు పిలుపు రాలేదు. ఇటీవ‌ల ముగిసిన విజ‌య్ హ‌జారే ట్రోఫీలో అత‌ను 7 ఇన్నింగ్స్‌లో 752 ర‌న్స్ చేశాడు. వ‌న్డే టోర్నీల‌కు అత‌న్ని ఎంపిక చేస్తార‌న్న ఊహాగానాలు వినిపించాయి. కానీ సెలెక్ట‌ర్లు పెద్ద‌గా ఇంట్రెస్ట్ పెట్ట‌లేదు. బ్యాట‌ర్లు అంద‌రూ 40 యావ‌రేజ్‌తో ఉన్నార‌ని, అందుకే నాయ‌ర్‌ను ఎంపిక చేయ‌డం క‌ష్ట‌మైంద‌ని చీఫ్ సెలెక్ట‌ర్ అగార్క‌ర్ తెలిపాడు.

ఇటీవ‌ల ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన తెలుగు బ్యాట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డేల‌కు గిల్ కెప్టెన్‌గా చేశాడ‌ని, అత‌ని గురించి డ్రెస్సింగ్ రూమ్ నుంచి మంచి అభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అందుకే అత‌న్ని వైస్ కెప్టెన్‌గా నియ‌మిస్తున్న‌ట్లు అగార్క‌ర్ తెలిపాడు.