Unbeaten India Win ICC Champions Trophy 2025

Dubai, March 09: ఛాంపింయన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది టీమ్‌ ఇండియా. దుబాయ్‌లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఛాంపియన్స్‌గా ఆవతరించింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్‌తో టీమ్‌ ఇండియా జయకేతనం ఎగురవేసింది. భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ లో (Champions Trophy Final) న్యూజిలాండ్‌ 252 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) రాణించారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్‌ శాంట్నర్‌ (8) పరుగులు చేశారు. నాథన్‌ స్మిత్‌ 0 (1) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు.

ICC Champions Trophy 2025 Final: వీడియోలు ఇవిగో.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ ఎలా ఔట్ అయ్యారో చూడండి, భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్! 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ముఖ్యంగా రచిన్ దూకుడుగా ఆడాడు. దీంతో 7 ఓవర్లకే స్కోరు 50 దాటింది. విల్‌ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కాసేపటికే కుల్‌దీప్ యాదవ్ తన వరుస ఓవర్లలో రచిన్‌ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌ను ఔట్‌ చేసి భారత్‌కు భారీ ఉపశమనాన్ని అందించాడు. తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. లేథమ్‌ని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను డారిల్ మిచెల్, ఫిలిప్స్‌ ఆదుకున్నారు.

India Win Champions Trophy by 4 Wickets

 

ఈ జోడీ నిలకడగా సింగిల్స్‌ తీస్తూ రన్‌రేట్ భారీగా పడిపోకుడా చూసుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వరుణ్ విడదీశాడు. అద్భుతమైన బంతితో గ్లెన్ ఫిలిప్స్‌ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధ శతకం చేసిన డారిల్ మిచెల్‌ని షమి ఔట్ చేశాడు. చివర్లో మైకేల్ బ్రాస్‌వెల్ మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్‌ 250 పరుగుల స్కోరును దాటగలిగింది. కివీస్ చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు చేయడం విశేషం.