రాష్ట్రీయం

Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చ‌ర‌ర్‌ని చిత‌క‌బాదిన త‌ల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన

Advertisement

రాష్ట్రీయంசெய்திகள்

Egg Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, సామాన్యులు కొనలేక విలవిల, జనవరి వరకు ఇదే పెరుగుదల ఉంటుందని చెబుతున్న మార్కెట్ వర్గాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సాధారణ ప్రజలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న ఈ పెరుగుదల రిటైల్ నుండి హోల్‌సేల్ మార్కెట్ల వరకు అన్ని స్థాయిల్లో ప్రభావం చూపిస్తోంది. ఒక్కో గుడ్డు ధర రిటైల్ అవుట్‌లెట్లలో ఏడు రూపాయలను దాటిపోవడం వినియోగదారులకు గట్టి భారం అయింది.

YS Jagan: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్, నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ, అనంతరం సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్

Team Latestly

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కొద్ది సేపు వెయిటింగ్ రూంలో వేచిచూశారు.

Passenger Falls from Train: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘటన

Team Latestly

హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌ వైపు జారిపోయాడు.

Telangana: దారుణం.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి, సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు

Team Latestly

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తోన్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Tirumala Update: డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, సామాన్యులకే పెద్దపీట వేయనున్న టీటీడీ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు

Team Latestly

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను ప్రకటించింది. ప్రతి ఏడాదిలా ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

Weather Update: తెలంగాణలో చలిపులి పంజా, గజగజ వణుకుతున్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ

Team Latestly

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం

Team Latestly

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.

Saudi Arabia Bus Accident: ఎంత విషాద ఘటన ఇది.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి, సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Team Latestly

తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.

Advertisement

Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు

Team Latestly

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు

Team Latestly

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి

Team Latestly

రాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.

AP Weather Forecast: బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం, ఏపీకి మరోసారి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక

Team Latestly

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వాతావరణం మరింత చల్లగా మారింది. ఈ పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది

Team Latestly

అనుమానం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది. వివాహ బంధం నమ్మకంపై నిలబడే కాపురంలో, అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన జీవిత భాగస్వామినే కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్‌ఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana Weather Update: గజగజ వణుకుతున్న హైదరాబాద్, తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత, వచ్చే మూడు రోజుల పాటు మరింతగా తగ్గనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా డిసెంబర్‌ మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి నవంబర్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం ప్రజలను వణికిస్తోంది.

Hyderabad Stabbing Incident: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య , 10 నిమిషాలు వెంటాడి దాడి చేసిన ప్రత్యర్థి, శాంతిభద్రతలపై నగరవాసుల ఆందోళన

Team Latestly

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో బుధవారం సాయంత్రం రౌడీషీటర్‌ హత్య జరిగిన ఘటన కలకలం రేపింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

Nalgonda Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును వెనుక నుండి ఢీకొట్టిన లారీ, బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం

Team Latestly

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద సోమవారం శ్రీ విద్యాపీట్ బస్సును లారీ వెనుక నుండి ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి, దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

Team Latestly

తెలంగాణలో వర్షాలకు తెరపడగా.. ఇప్పుడు చలి దాడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండగా.. రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Team Latestly

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.

Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు

Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి

Team Latestly

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement