రాష్ట్రీయం
Telangana Electric Vehicle Policy: తెలంగాణ నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ రిలీజ్, 2026 వరకు అమల్లో ఉండనున్న కొత్త పాలసీ, వాయు కాలుష్యం తగ్గించేందుకేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
Arun Charagondaనూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ జీవో 41ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి 2026 వరకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహన కాలుష్యం తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని రూపొందించినట్లు చెప్పారు.
Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Arun Charagondaమీరందరూ చాలా మంది తెలంగాణ నుండి వచ్చారు..మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో..జై తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని...ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.
Telangana Group 3 Exam: గ్రూప్ 3 పరీక్షకు భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో పరీక్ష కేంద్రం బయట తండ్రి..వైరల్‌గా మారిన ఫోటోలు!
Arun Charagondaభార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బైట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్నాడు ఓ భర్త. శంకర్ అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించాడు.
Bandi Sanjay Slams KTR: తెలంగాణలో 'ఆర్ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్
Arun Charagondaబీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. దాడులతో ప్రజల ప్రాణాలాతో బీఆర్ఎస్ చెలగాటమడుతోందన్నారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని... తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
Police Case On Sri Reddy: నటి శ్రీరెడ్డికి షాక్..వరుసగా పోలీస్ కేసులు, ఈ సారి విజయనగరంలో పోలీస్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaనటి శ్రీరెడ్డికి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మరో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనితలతో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Telangana: రంగారెడ్డి జిల్లా ఆలయంలో చోరీ...ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు...పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆలయ పూజారి
Arun Charagondaఆలయంలో పంచ లోహ విగ్రహాలు మాయం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయకుడు, అయ్యప్పస్వామి పంచ లోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
Telangana: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిసిన అఘోరి, ఓ ప్రైవేట్ ఆస్పత్రి కార్యక్రమంలో ప్రత్యక్షం..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిశారు అఘోరి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి...ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా అఘోరి ఆశీర్వాదం తీసుకున్నారు మల్లు నందిని.
Lagacharla Victims: లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Arun Charagondaలగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు బాసటగా ప్రజాసంఘాల నేతలు నిలిచారు. జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి ప్రజా సంఘాలు.
Mid Manair Project: మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
sajayaరేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 గ్రామాలకు చెందిన నాలుగు వేలకు పైగా కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad Shocker: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన షాకింగ్ ఘటన..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
sajayaఆడపిల్ల ఇంటికి బరువైపోయింది. అప్పుడే పుట్టిన పసికందును కన్న పేగు నుంచి దూరం చేసి రోడ్డు పక్కన పారేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసిన స్థానికులంతా మానవత్వం మంట కలిసిపోయిందని షాక్ తింటున్నారు.
Khammam Shocker: ఖమ్మంలో షాకింగ్ ఘటన...విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..
sajayaఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది కటింగ్ సరిగ్గా చేయించుకోలేదని ఓ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటన జిల్లాలో కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Lady Aghori: తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి.. (వీడియో)
Rudraఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
High Security To Prateek Jain: లగచర్ల ఘటన నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత.. 2+2 గన్ మెన్ కేటాయింపు.. పరారీలో ప్రధాన నిందితుడు
Rudraవికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది.
TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది.
KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?
Arun Charagondaబఫర్ జోన్ లో ఇల్లు ఉందని సామాన్యుల ఇండ్లు కూలగొడతా అంటున్నావ్.. మరి పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని అంటున్నావు ఇదెక్కడి న్యాయమో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...ఇంట్లకెళ్ళి ఏమో మురికి నీళ్లు ఒస్తది… మాల్ లో కెళ్ళి ఏమన్నా సుగంధం వస్తదా? చెప్పాలన్నారు కేటీఆర్.
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ భయం, రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పొగోట్టుకున్న యువకుడు..శంషాబాద్‌లో విషాదం
Arun Charagondaడ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. శంషాబాద్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకోగా అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. హయత్‌నగర్‌లో అమ్మాయికి బెదిరింపులు,బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలి ఆవేదన..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ - హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని తెలిపింది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని.
Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం, మజ్లిస్ పార్టీపై పంచ్‌లు..శివసేన-జనసేన ధర్మం కోసమే పోరాడుతాయని వెల్లడి
Arun Charagondaమహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీపై పంచ్‌లు వేస్తూనే శివసేన -జనసేన ధర్మం కోసమే కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేల ఇది.. దమ్కీలకు భయపడం అని తేల్చిచెప్పారు.
Andhra Pradesh: పెన్ను గురించి గొడవ.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య, నరసరావు పేట భావన కాలేజీ క్యాంపస్‌లో ఘటన...విషాద ఛాయలు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడ్ జిల్లా నరసరావు పేట భావన కాలేజీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెన్ను గురించి గొడవ జరిగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనూష . మృతురాలి స్వగ్రామం బొల్లాపల్లి మండలం వెల్లటూరు.